Calcutta High Court: వారిని డార్లింగ్‌ అనడం లైంగిక వేధింపే

4 Mar, 2024 06:22 IST|Sakshi

పరిచయం లేని మహిళ విషయంలో అది శిక్షార్హమైన నేరమే

తేలి్చచెప్పిన హైకోర్టు

కోల్‌కతా: ఫూటుగా తాగి మహిళా కానిస్టేబుల్‌ను డార్లింగ్‌ అని పిలిచిన ఓ వ్యక్తిని దోషిగా తేలుస్తూ కలకత్తా హైకోర్టు తీర్పు వెలువరిచింది. పరిచయం లేని మహిళను అలా పిలవడడాన్ని ‘లైంగిక వేధింపు నేరం’గా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సందర్భంగా ఇదే కేసులో గతంలో కింది కోర్టు ఇచి్చన తీర్పును హైకోర్టు సమర్థించింది. భారతీయ శిక్షాస్మృతిలోని 354ఏ (మహిళా గౌరవాన్ని భంగపరచడం), 509 సెక్షన్ల కింద అతడిని దోషిగా తేలి్చంది.

మహిళా కానిస్టేబుల్‌ను మద్యం మత్తులో డార్లింగ్‌ అని పిలిచిన జనక్‌ రామ్‌ అనే వ్యక్తికి గతంలో పడిన శిక్షను సమరి్థస్తూ జస్టిస్‌ జై సేన్‌ గుప్తా నేతృత్వంలోని ఏకసభ్య హైకోర్టు ధర్మాసనం తాజా తీర్పును వెలువరిచింది. ‘‘ పరిచయంలేని మహిళను తాగిన/తాగని వ్యక్తి నడి వీధిలో డార్లింగ్‌ అనే పిలిచే ధోరణి భారతీయ సమాజంలో లేదు. నిందితుడు మద్యం మత్తులో ఉంటే అప్పుడు నేరాన్ని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తాం’ అని జడ్జి వ్యాఖ్యానించారు. అండమాన్‌ నికోబార్‌ ద్వీపంలోని మాయాబందర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జనాన్ని అదుపు చేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ను ‘చలాన్‌ వేయడానికి వచ్చావా డార్లింగ్‌?’ అంటూ జనక్‌రామ్‌ వేధించాడు.

whatsapp channel

మరిన్ని వార్తలు