పేదలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు

5 May, 2021 17:32 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కల్లోలం రేపుతుండగా చాలా రాష్ట్రాల్లో తీవ్ర ఆంక్షలు అమల్లో ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ కూడా అమల్లో ఉంది. దీంతో పేదలు, రోజువారీ కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక అవస్థలు పడుతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఆహార ధాన్యాలు అందించేందుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈనెల నుంచే పేదలకు ఆహార ధాన్యాలు ఐదు కిలోల చొప్పున అందిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మే, జూన్‌ నెలల్లో ఉచితంగా ఆహార ధాన్యాలు ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన కింద అందించనుంది. ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున 79.88 కోట్ల మందికి ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది.

చదవండి: కరోనా వివాహం: నిజంగంటే ఇది బొంగుల పెళ్లి
చదవండి: ఆక్సిజన్‌ కొరత లేదు.. కరోనా కంట్రోల్‌లోనే

మరిన్ని వార్తలు