జాగింగ్‌కని వెళ్లి ప్రియురాలతో ఎంజాయ్‌.. భార్యను చూసి రన్నింగ్‌

30 Sep, 2021 18:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

‘‘ఏమోయ్‌ నేను ఈ మధ్య బాగా లావయ్యాను కదా.. బరువు తగ్గడం కోసం జాగింగ్‌కు వెళ్దామనుకుంటున్నాను.. ఏం అంటావ్‌’’ అని అమాయకంగా భార్యను అడిగాడు ఓ వ్యక్తి. భర్త ఆరోగ్యంగా ఉండటమే తనకు ముఖ్యమని భావించిన ఇల్లాలు సరే అంది. భర్త జాగింగ్‌ ప్రారంభించి నెల రోజుల పైనే అవుతుంది. అయినా ఒక్క గ్రాము బరువు కూడా తగ్గలేదు. దాంతో ఆ ఇల్లాలికి అనుమానం వచ్చింది. 

ఓ రోజు భర్తకు తెలియకుండా అతడి వెనకే ఫాలో అయ్యింది. ఇక పార్కులో కనిపించని దృశ్యం చూసి ఆమె షాకయ్యింది. ఎందుకంటే భర్త అక్కడ తన ప్రియురాలితో ముచ్చట్లాడుతూ కనిపించాడు. భార్యను అక్కడ చూసిన భర్త.. వెంటనే పరుగందుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
(చదవండి: 2021 నుంచి అయినా ఫిట్‌గా ఉందాం : రాష్ట్రపతి)

ఈ సంఘటన ఎక్కడ జరిగింది వంటి వివరాలు లేవు. జాగింగ్‌ పేరు చెప్పి.. ఓ వ్యక్తి ప్రతి రోజు పార్క్‌కు వెళ్లి ప్రియురాలిని కలుస్తుండేవాడు. జాగింగ్‌ చేసినప్పటికి భర్త బరువు తగ్గకపోవడంతో అనుమానం వచ్చి.. ఓ రోజు అతడి వెనకే పార్క్‌కు వెళ్లింది భార్య. అక్కడ ప్రియురాలితో సరదాగా గడుపుతున్న భర్తను చూసి షాకయ్యింది. 

వారి వెనక నిల్చుని ‘‘ఓహో తమరు చేసే జాగింగ్‌ ఇదా’’ అని ప్రశ్నించింది. సడెన్‌గా పార్క్‌లో భార్య గొంతు వినిపించేసరికి.. అతగాడికి ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ప్రియురాలితో కలిసి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఇక భార్య దగ్గరకు రావడం చూసి నెమ్మదిగా అక్కడ నుంచి జారుకున్నాడు. ఆ తర్వాత పరుగందుకున్నాడు. ఇక సదరు ఇల్లాలు.. ‘‘ఆగు.. నా మాట విను.. ఇలాగే పరిగెత్తావనుకో.. ఇంటికి వచ్చాక నీ పని చెప్తాను’’ అని హెచ్చరించింది. 
(చదవండి: Viral Video: కేంద్ర మంత్రి డ్యాన్స్‌.. ప్రధాని మోదీ స్పందన)

ఓ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో ఈ వీడియోని షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు.. ‘‘బాగా అయ్యింది.. ఇంటికెళ్లాక నీకు ఉంది పో’’.. ‘‘బలే బుక్కయ్యావ్‌ కదా ఇక నీకు చుక్కలు చూపిస్తుంది నీ భార్య’’ అంటూ కామెంట్‌ చేస్తున్నారు నెటిజనులు.  

చదవండి: పోలీసుల సలహా : 3 రోజులు భార్యతో.. 3 రోజులు ప్రేయసితో..

మరిన్ని వార్తలు