చైనా కుట్ర : సరిహద్దుల్లో పంజాబీ సాంగ్స్‌

17 Sep, 2020 12:19 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి చైనా- భారత్‌ సరిహద్దులో డాగ్రన్‌ కంట్రీ  ఒప్పందాలు తుంగలో తొక్కుతూ కాల్పులు జరుపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా చైనా అనేక కుట్రలు పన్నుతూ భారత్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పుడు మరొక నీచమైన చర్యకు చైనా పాల్పడింది.  వాస్తవాధీన రేఖ వెంబడి భారీ లౌడ్‌ స్పీకర్లు ఉంచి, పంజాబీ సాంగ్స్‌ ప్లే చేస్తూ భారత సైన్యం దృష్టి మరల్చే ప్రయత్నాలు మొదలు పెట్టింది.

లద్ధాఖ్‌లోని ప్యాంగ్‌యాంగ్‌ ప్రాంతంలోని ఫింగర్‌ 4 ఏరియాలో లౌడ్‌ స్పీకర్లను ఉంచింది. చైనాతో సరిహద్దు వివాదం మొదలవడంతో భారత సైన్యం పగలు, రాత్రి అనే తేడా లేకుండా కంటిమీద కునుకేయకుండా కాపల కాస్తోంది. దీంతో వారి కన్నుగప్పడానికి చైనా ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడుతోంది.  అంతటితో ఆగకుండా హిందీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడ చేస్తున్నట్లు భారత ఆర్మీ  అధికారి ఒకరు తెలిపారు. మన సైనికులు ఇలాంటి ప్రలోభాలకు లొంగడం లేదని, అంతేకాకుండా మ్యూజిక్‌ వింటూ ఆనందిస్తున్నారని ఆ అధికారి పేర్కొన్నారు.   

ఇక చైనా భారత్‌ వివాదం గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్‌ సింగ్‌ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, భారత భూభాగం 38,000 కిలోమీటర్ల చదరపు అడుగులను చైనా ఆక్రమించిందని తెలిపారు. సరిహద్దు ఒప్పందాన్ని అతిక్రమించి చైనా ఈ దుశ్చర్యలకు పాల్పడుతుందని ఆయన పేర్కొన్నారు. శాంతి ఒప్పందం ద్వారా భారత్‌ ఈ సమస్యను పరిష్కరించాలని ఆలోచిస్తుందని రాజ్‌నాధ్‌ సింగ్‌ తెలిపారు. 

చదవండి: చైనా నుంచి చొరబాట్లు లేవు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు