భారత్‌ను చైనాతో పోల్చొద్దు: మోదీ

23 Dec, 2023 06:08 IST|Sakshi

న్యూఢిల్లీ: అభివృద్ధి విషయంలో భారత్‌ను పొరుగు దేశమైన చైనాతో పదేపదే పోలుస్తుండడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసహనం వ్యక్తం చేశారు. భారత్‌ను ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి తప్ప చైనాతో కాదని తేలి్చచెప్పారు. తాజాగా ఆయన ఓ ఆంగ్ల వార్తా పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చారు. చైనా ప్రజాస్వామ్య దేశం కాదని, అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోందని చెప్పారు. భారత్‌ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చమే సముచితమని సూచించారు. ఇండియాలో నిరుద్యోగం, అవినీతి, పరిపాలనాపరమైన అడ్డంకులు, నైపుణ్యాల లేమి వంటివి పెద్దగా లేవని మోదీ పేర్కొన్నారు.

నిజంగా ఇలాంటి అంశాలు ఉండి ఉంటే, ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే హోదా మన దేశానికి దక్కేది కాదని స్పష్టం చేశారు. పలు అంతర్జాతీయ సంస్థల్లో భారత సంతతి సీఈఓలు సేవలు అందిస్తున్నారని గుర్తుచేశారు. ఇండియాలో నైపుణ్యాల లేమి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదని అభిప్రాయపడ్డారు. దేశంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టిస్తున్నామని మోదీ వెల్లడించారు. ప్రఖ్యాత విదేశీ సంస్థలను ఆకర్శించడమే తమ లక్ష్యమని తెలిపారు. దేశంలో మైనార్టీలను అణచివేస్తున్నారన్న ఆరోపణల్లో పస లేదని స్పష్టం చేశారు. మైనారీ్టలపై ఎలాంటి వివక్ష లేదన్నారు. 20 కోట్ల మంది మైనార్టీలు ఇక్కడ క్షేమంగా జీవిస్తున్నారని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు