‘నెలసరి విషయం వారికి ఎందుకు తెలియాలి?’

22 Dec, 2023 20:19 IST|Sakshi

ఢిల్లీ: నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజమైన ప్రక్రియ అని.. అదేం వైకల్యం కాదని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత్‌లో మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్‌ లీవ్‌ ఇవ్వాలన్న డిమాండ్‌ పెరిగిన నేపథ్యంలో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. నెలసరి సమయంలో ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు ప్రకాటించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో పలువురు మహిళా నేతలు ఆమె వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఇక ఈ విషయంలో ఆమె తీవ్ర విమర్శల పాలయ్యారు. ఇదే విషయంపై  తాజాగా ఓ  ఇంటర్వ్యూలో స్మృతి ఇరానీ మాట్లాడారు. 

మహిళలకు సంబంధించిన సున్నితమైన నెలసరి విషయం ఉద్యోగం చేసే చోటు సదరు సంస్థల యాజమనులకు ఎందుకు తెలియాలి? అని అన్నారు. ఇది మహిళలకు కొంత అసౌకర్యంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ప్రభుత్వం నెలసరి సమయంలో వేతనంతో కూడిన సెలవుపై ఒక తప్పనిసరి విధానం తీసుకురాలేదని వెల్లడించారు. ఒకవేళ ఒంటరి మహిళగా ఉన్న ఉద్యోగిని తాను ఆ సమయంలో సెలవు తీసుకోవడానికి ఆసక్తి చూపించకపోతే.. తాను వేధింపులను ఎదుర్కొవల్సి వస్తుందని తెలిపారు. అధికారికంగా పెయిడ్‌ లీవ్‌  మంజూరు చేస్తే.. ఈ విషయాన్ని  సంస్థల్లో హెచ్‌ఆర్‌,  అకౌంట్స్‌ వాళ్లకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. అలా పలు సంస్థల్లో పని చేసే చోట తెలియకుండానే మహిళలపై ఒక వివక్షను పెంచినవాళ్లము అవుతుమని తెలిపారు.

అయితే తాను పార్లమెంట్‌లో ఇచ్చిన సమాధానం సంబంధించి ప్రశ్న మరోకటిని వెల్లడించారు. ఆ రోజు ఎంపీ మనోజ్‌ ఝా LGBTQIA+ కోసం ప్రభుత్వం వద్ద ఏదైనా పీరియడ్‌ సెలవు విధానం ఉందా? అని అడిగారని తెలిపారు. గార్భాశయం లేని ఏ స్వలింగ సంపర్కుడికి రుత చక్రం ఉంటుంది? అని తాను చెసిన వ్యాఖ్యలపై మరోవిధంగా వ్యాప్తి చెంది వివాదం రేగిందని చెప్పారు.

మరోవైపు మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి  స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించిన విషయం తెలిసిందే. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని స్మృతీ ఇరానీ చేసిన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ  కవిత తప్పుపట్టారు.

చదవండి:  ధన్‌ఖడ్‌పై ఖర్గే విమర్శలు.. నేను అలా అనుకోవాలా?

>
మరిన్ని వార్తలు