Save Democracy: ప్రజాస్వామ్యానికి పెనుముప్పు

23 Dec, 2023 05:03 IST|Sakshi
శుక్రవారం ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి ధర్నాలో ఏచూరి, రాహుల్, ఖర్గే, పవార్, డి.రాజా తదితరులు

146 మంది ఎంపీల సస్పెన్షన్‌కు నిరసనగా ‘సేవ్‌ డెమొక్రసీ’ పేరుతో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా  

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ఉభయ సభల నుంచి 146 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్‌ చేయడంపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. నరేంద్ర మోదీ ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్ష సభ్యుల సస్పెన్షన్‌ను వ్యతిరేకిస్తూ శుక్రవారం ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ‘సేవ్‌ డెమొక్రసీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. 

పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై ప్రశి్నస్తే బహిస్కరిస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడుకోవడానికి ప్రజలంతా ఏకం కావాలని ఇండియా కూటమి నాయకులు పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాం«దీతోపాటు వామపక్ష నాయకులు, డీఎంకే, ఎన్సీపీ, సమాజ్‌వాదీ పార్టీ, నేషనల్‌ కాన్ఫరెన్స్, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ, జేఎంఎం, రాష్ట్రీయ జనతాదళ్‌ తదితర పారీ్టల నాయకులు, పార్లమెంట్‌ ఉభయ సభల నుంచి సస్పెండైన ఎంపీలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే ప్రసంగించారు. బీజేపీ ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం పెనుముప్పును ఎదుర్కొంటోందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ప్రతిపక్షాలు చేతులు కలపాల్సి వచి్చందని చెప్పారు. అందరూ ఒక్కటై కలిసికట్టుగా పనిచేస్తే ప్రధాని నరేంద్ర మోదీ చేయగలిగేది ఏమీ ఉండదని అన్నారు. ప్రభుత్వం తమను ఎంతగా అణచివేయాలని చూస్తే అంతగా పైకి లేస్తామని స్పష్టం చేశారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలన్న లక్ష్యంతోనే తామంతా ఉమ్మడిగా పోరాడుతున్నామని ఖర్గే ఉద్ఘాటించారు. తెలంగాణతోపాటు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని మోదీ వీధివీధికీ తిరిగినా బీజేపీ ఓడిపోయిందని అన్నారు.  

ప్రజల గొంతుకలను అణచి వేశారు  
పార్లమెంట్‌లో ఈ నెల 13న చోటుచేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పాలని ప్రశ్నించినందుకు పార్లమెంట్‌ నుంచి 146 మంది విపక్ష సభ్యులను అన్యాయంగా సస్పెండ్‌ చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. అధికార బీజేపీ దేశంలో విద్వేషాన్ని మరింతగా వ్యాప్తి చేస్తోందని, ‘ఇండియా’ కూటమి పారీ్టలు మాత్రం మరింత ప్రేమ, సోదరభావాన్ని పంచుతున్నాయని వ్యాఖ్యానించారు. 146 మంది ఎంపీలను పార్లమెంట్‌ నుంచి బహిష్కరించడం ద్వారా దేశ జనాభాలో 60 శాతం మంది ప్రజల గొంతుకలను  ప్రభుత్వం అణచివేసిందని ఆరోపించారు.  ‘‘ఇద్దరు ముగ్గురు వ్యక్తులు పార్లమెంట్‌లోకి దూకి పొగ వదిలారు. దీనిని చూసి బీజేపీ ఎంపీలు పారిపోయారు. దేశ భక్తులుగా చెప్పుకునే బీజేపీ నేతల గాలి పోయింది’’ అంటూ రాహుల్‌ ఎద్దేవా చేశారు.  

వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి  
2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని చిత్తుచిత్తుగా ఓడించాలని ఇండియా కూటమి నాయకులు చెప్పారు. ప్రతిపక్షాల గొంతు నొక్కేయడానికి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ విమర్శించారు. పార్లమెంట్‌ నుంచి బయటకు పంపిస్తే విపక్షాల నోరు మూసుకుంటాయని ప్రభుత్వం భావిస్తోందని ఆక్షేపించారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ... దేశ ప్రజలకు రాజ్యాంగం కలి్పంచిన సార్వ¿ౌమత్వం ప్రజాప్రతినిధుల ద్వారా అమలు కావాలన్నారు.

అమృత మథనం కథలో అమృతం రాక్షసుల చేతికి చిక్కిందని, దాన్ని వెనక్కి తెచ్చేందుకు అందరూ ప్రతిజ్ఞ చేయాలని అన్నారు. పార్లమెంట్‌ను అనవసర వ్యవస్థగా మార్చడానికి ప్రభుత్వం ప్రయతి్నస్తోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా తప్పుపట్టారు. పార్లమెంట్‌కు విలువ లేకపోతే ప్రజాస్వామ్యం మరణిస్తుందన్నారు. ‘బీజేపీ విముక్త భారత్‌’ మన లక్ష్యం కావాలని తృణమూల్‌ పార్టీ ఎంపీ మౌసమ్‌ నూర్‌ అన్నారు. జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా, సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు దీపాంకర్‌ భట్టాచార్య, రా్రïÙ్టయ లోక్‌దళ్‌ నేత షహీద్‌ సిద్దిఖీ, సమాజ్‌వాదీ నేత ఎస్‌.సి.హసన్, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ నేత హస్‌నైన్‌ మసూదీ తదితరులు ప్రసంగించారు.

>
మరిన్ని వార్తలు