Harinarayan Gupta: విషాదం.. గుండెపోటుతో కాంగ్రెస్‌ నేత కన్నుమూత

17 Jul, 2022 19:39 IST|Sakshi

Congress Leader Harinarayan Gupta.. కాంగ్రెస్‌ నేత గుండెపోటు కారణంగా అకాల మరణం పొందాడు. ఎన్నికల్లో ఓటమిని భరించలేక తనువు చాలించారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని 413 మున్సిపాలిటీలు, 16 కార్పొరేషన్లు, 99 నగర పాలిక పరిషత్‌లు, 298 నగర్‌ పరిషత్‌లకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాగా, జూలై 6, 13 తేదీల్లో రెండు దశల్లో ఈ ఎన్నికలు నిర్వహించారు. అయితే, వీటి ఫలితాలు ఆదివారం వెల్లడించారు. ఎన్నికల్లో భాగంగా మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడైన హరినారాయణ్ గుప్తా, మునిసిపల్ కౌన్సిల్ వార్డు నెం.9లో కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌పై పోటీ చేశాడు. 

గుప్తాకు పోటీగా స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్‌ గుప్తా బరిలో నిలిచారు. కాగా, ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి అఖిలేష్ గుప్తా 14 ఓట్ల తేడాతో ఆయనపై గెలుపొందారు. ఈ క్రమంలో తన ఓటమి వార్త విన్న హరినారాయణ్ ఒక్కసారిగా షాకయ్యారు. అనంతరం గుండెపోటు కారణంగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. ఆయన మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అములుకున్నారు. 

ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్‌లోని తొలిసారిగా పోటీ చేసిన ఆమ్‌ ఆద్మీ పార్టీ.. సింగ్రౌలీలో విజయం సాధించింది. ఇక, బుర్హాన్‌పూర్, సత్నా, ఖాండ్వా, సాగర్‌లలో అధికార బీజేపీ విజయం సాధించింది. 

ఇది కూడా చదవండి: విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్‌ ఆల్వా

మరిన్ని వార్తలు