రికార్డు స్థాయిలో కరోనా: కొత్తగా 2,73,810 పాజిటివ్‌ కేసులు

19 Apr, 2021 11:22 IST|Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోంది​. దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. వరుసగా ఐదో రోజు రెండు లక్షల కరోనా పాజిటివ్‌ కేసులు నిర్థారణ అయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 2,73,810 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య సోమవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1619 మంది కోవిడ్‌ బాధితులు మృతి చెందారు.

ఇప్పటివరకు దేశంలో మొత్తం 1,50,61,919 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు పలు ఆస్పత్రుల నుంచి 1,29,53,821 మంది  కోవిడ్‌ బాధితులు డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు మొత్తం 1,78,769 మంది మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 19,29,329 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 12,38,52,566 మందికి కరోనా వ్యాక్సిన్‌ అందించారు. 

తెలంగాణలో భారీగా కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 4,009 కేసులు నమోదైనట్లు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 14 మంది కరోనా బాధితులు మృతి చెందారు. తెలంగాణలో మొత్తం 3,55,433 కేసులు నమోదు కాగా, ఇప్పటివరకు మొత్తం 1,838మంది మృతి చెందారు.

ప్రస్తుతం తెలంగాణలో 39,154 కరోనా యాక్టివ్ కేసులు ఉ‍న్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 705 కరోనా కేసులు నమోదు కాగా, మేడ్చల్ 363, రంగారెడ్డి 336, నిజామాబాద్‌లో 360 కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. సంగారెడ్డిలో 264, జగిత్యాలలో 175, వరంగల్ అర్బన్‌లో 146 కరోనా కేసులు నమోదయ్యాయి.
చదవండి: కర్ణాటకలో నిమిషానికి 10 కొత్త కేసులు 

మరిన్ని వార్తలు