దళితులు, గిరిజనులకు సముచిత గౌరవం

13 Aug, 2023 05:13 IST|Sakshi

గత ప్రభుత్వాలకు వీరు ఎన్నికలప్పుడే గుర్తొచ్చేవారు

మధ్యప్రదేశ్‌ సభలో ప్రధాని మోదీ విమర్శలు

సాగర్‌: గత ప్రభుత్వాలకు దళితులు, ఓబీసీలు, గిరిజనులు ఎన్నికలప్పుడే గుర్తుకు వచ్చేవారని ప్రధాని మోదీ ఆరోపించారు. దళిత బస్తీలు, నిరుపేదలుండే ప్రాంతాలు, గిరిజన ప్రాంతాల్లో నీటి వసతి కూడా ఉండేది కాదన్నారు. తమ ప్రభుత్వం మాత్రం దళితులు, ఓబీసీలు, గిరిజనులకు సముచిత గౌరవం ఇచ్చిందని, జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా వారి ఇళ్లలోకే మంచినీరు అందిస్తోందని చెప్పారు.

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా బడ్‌తుమా గ్రామంలో శనివారం ప్రధాని సంత్‌ రవిదాస్‌ జ్ఞాపకార్థం 11 ఎకరాల విస్తీర్ణంలో రూ.100 కోట్లతో నిర్మించే ఆలయం–స్మారక నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం బినా–కోటా డబుల్‌ లేన్‌ రైలు మార్గాన్ని జాతికి అంకితం చేయడంతోపాటు వివిధ రహదారి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ధానాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు.

మరిన్ని వార్తలు