నిరుపేద కుటుంబాలకు సీఎం ఆపన్న హస్తం

14 Oct, 2023 05:00 IST|Sakshi
సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఆర్థిక సహాయం అందజేస్తున్న కలెక్టర్‌ కృతికా శుక్లా 

కాకినాడ జిల్లాలో రూ.17లక్షలు అందజేత 

కాకినాడ సిటీ: సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. నిరుపేదలు పడుతోన్న కష్టాలను విని స్పందించి ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో గురువారం సీఎంను హెలిప్యాడ్‌ వద్ద పలువురు కలిసి తమ గోడు విన్నవించారు. వివిధ వైద్య అవసరాల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) నుంచి ఆర్థిక సాయం కోరుతూ వినతి పత్రాలు అందజేశారు.

తప్పకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి వారికి భరోసా ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు కాకినాడ కలెక్టరేట్‌లో 17 మంది బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున చెక్కులను కలెక్టర్‌ కృతికా శుక్లా అందజేశారు. ఆమె మాట్లాడుతూ సీఎం జగన్‌ జిల్లా పర్యటనలో భాగంగా పలువురు బాధితుల సమస్యలు విని తక్షణమే స్పందించి వారికి ఆర్థిక సహాయం అందిస్తూ వారి కుటుంబాలకు భరోసా కల్పించాలని తమకు ఆదేశాలిచ్చారన్నారు. శస్త్ర చికిత్సల కోసం కొందరు, ఇతర ఆరోగ్య సేవల కోసం మరికొందరు తమకు సహాయం చేయాలని సీఎంను అడగ్గా ఆ వెంటనే తదనుగుణంగా సీఎం ఆదేశాలిచ్చారని, దీంతో తమను ఆదుకున్నందుకు సీఎం జగన్‌కు లబి్ధదారులు ధన్యవాదాలు తెలిపినట్లు కలెక్టర్‌ చెప్పారు.

ఈ ఆర్థిక సహాయం పొందిన వారిలో ఈ సత్య సుబ్రహ్మణ్యం (పెద్దాపురం), టీ.ఆనంద్‌కుమార్‌ (కిర్లంపూడి), కృష్ణకాంత్‌ (పెద్దాపురం), బుర్రా రాజు (పెద్దాపురం), లక్ష్మి ఆకాంక్ష (పెద్దాపురం), సింగం శ్యామల భాను (కాకినాడ), ఐ సాయి వెంకట్‌ (పెద్దాపురం), డి నవీన్‌ (పెద్దాపురం) డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన పి.మాధురి నవ్య, ఐ.నైనిక, జె.వీరవెంకట సాయి, సిహెచ్‌ హర్షిత, వి.శశిశ్రీనేత్ర, జి.సుజాత, ఎన్‌.సతీష్, పి.ప్రేమ్‌ చంద్, కె.మార్తమ్మ (నంద్యాల)ఉన్నారు.

మరిన్ని వార్తలు