ఖైదీలను వణికిస్తున్న కోవిడ్‌ మహమ్మారి

17 May, 2021 09:31 IST|Sakshi
బరంపురం జైలు

బరంపురం సర్కిల్‌ జైలులో విజృంభిస్తున్న కరోనా

వైరస్‌ బారినపడిన 47 మంది ఖైదీలు

పరిమితికి మించి ఖైదీలు ఉండడమే కారణం

బరంపురం: ఎక్కడికి వెళ్లకుండా ఉంటున్న వారిని సైతం కోవిడ్‌ మహమ్మారి భయబ్రాంతులకు గురిచేస్తోంది. నగరంలోని సర్కిల్‌ జైలులో ఉంటున్న ఖైదీలు ఒక్కొక్కరిగా వైరస్‌ బారినపడుతున్నారు. దీనంతటికీ కారణం ఈ జైలులో పరిమితికి మించి అధిక సంఖ్యలో ఖైదీలు ఉండడమే అంటున్నారు విశ్లేషకులు. ఇక్కడి జైలులో 743 మంది ఖైదీలు మాత్రమే ఉండేందుకు అవకాశం ఉండగా, ప్రస్తుతం 941 మంది ఖైదీలు ఉండడం విశేషం. దీంతో ఒకేగదిలో ఎక్కువ మంది ఖైదీలు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడడంతో కరోనా నిబంధనలు ఉల్లంఘనకు గురవడం జరుగుతోంది.

ఇటీవల జైలులోని దాదాపు 47 మంది ఖైదీలు కరోనా బారినపడి, చికిత్స పొందుతున్నారు. వీరిలో ఓ విచారణ ఖైదీ పరిస్థితి విషమంగా ఉండడంతో అతడిని ఎంకేసీజీ మెడికల్‌ కళాశాల ఆస్పత్రిలోని కోవిడ్‌ కేర్‌ సెంటర్‌కి తరలించి, చికిత్స అందజేస్తున్నారు. మిగతా 46 మంది బాధిత ఖైదీలను అదే జైలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 100 పడకల కోవిడ్‌ కేర్‌ సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ఇక్కడి ఖైదీలను వేరేచోట జైలుకి తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఈ విషయమై రాష్ట్ర జైలు శాఖకి పలుమార్లు లేఖలు కూడా రాశామని జైలర్‌ సత్యనారాయణ తెలిపారు. ఇటీవల ఇక్కడి నుంచి గజపతి జిల్లాలోని పర్లాకిమిడి సబ్‌ జైలుకి ఇద్దరు ఖైదీలను కూడా తరలించామని ఆయన పేర్కొన్నారు.

చదవండి: మందుబాబులకు శుభవార్త: ఆర్డర్‌ పెట్టు.. మందు పట్టు
చదవండి: ప్రభుత్వ టీచర్‌ కుటుంబాన్ని చిదిమేసిన కరోనా

మరిన్ని వార్తలు