సగం కాలిన మృతదేహాలు.. పీక్కు తింటున్న కుక్కలు

2 Jun, 2021 04:48 IST|Sakshi

షాక్‌కు గురవుతున్న ఉత్తరకాశీ వాసులు

ఉత్తరకాశీ: భాగీరథి నది ఒడ్డునే ఉన్న కేదార్‌ఘాట్‌ శ్మశానంలో సగం కాలిన మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నట్లున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. దీనిపై స్థాని కులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇదంతా మున్సిపల్, జిల్లా అధికారుల నిర్లక్ష్య వల్లనేనని మండిపడుతున్నారు. కోవిడ్‌ బారిన పడి చనిపో యిన వారికి కూడా ఈ శ్మశానంలోనే అంత్యక్రియలు జరుపుతున్నారని, కుక్కలు పీక్కు తింటున్న మృతదేహాల్లో వైరస్‌ బారిన పడినవి కూడా ఉండి ఉంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భాగీ రథి నదిలో నీటి మట్టం పెరగడంతో సరిగా కాలని మృతదేహాలు కొన్ని వరదలో కొట్టుకుపోగా, మిగతా వాటిని కుక్కలు లాక్కెళుతున్నాయని అం టున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా.. ఆ వీడియోలు వారం క్రితం నాటివనీ,  కేదార్‌ఘాట్‌ను శుభ్రం చేసేలా మునిసిపల్‌ సిబ్బంది అప్రమత్తం చేశామని వివరించారు.

మరిన్ని వార్తలు