ప్రముఖ ఆర్థిక వేత్త అమర్త్య సేన్‌కు కరోనా

9 Jul, 2022 16:44 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్‌ గ్రహిత అయిన అమర్త్యసేన్‌కు కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. అమర్త్యసేన్‌ ప్రస్తుతం తన శాంతినికేతన్‌ నివాసంలో స్వీయ నిర్బంధంలో ఉన్నారు. జూలై 1న తన నివాసానికి వచ్చిన అమర్త్యసేన్‌ కొద్దిరోజులకే అనారోగ్యం బారిన పడ్డారంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి.

ఈ మేరకు ఆయన డాక్టర్లను సం‍ప్రదించడంతో వైద్య పరీక్షల్లో కరోనా వచ్చినట్లు నిర్థారణ అయ్యింది.  వాస్తవానికి అమర్త్యసేన్‌ కోల్‌కతాలోని పెళ్లికి హాజరు కావల్సి ఉంది. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి లండన్‌ వెళ్లాల్సి ఉంది కూడా. ఐతే ప్రస్తుతం ఆ ప్రయాణాలన్ని రద్దయ్యాయి. అమర్త్యసేన్‌ ప్రస్తుతం తన నివాసంలో చికిత్స తీసుకుంటున్నట్లు అతని కటుంబం వెల్లడించింది. 

(చదవండి: యోగి రాయబారం: ‘రాజకీయ పరిణితి లేనోడు’.. అఖిలేష్‌కి ఒకేసారి డబుల్‌ షాక్‌)

మరిన్ని వార్తలు