తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

3 Mar, 2023 14:02 IST|Sakshi

యూపీఏ చైర్‌ పర్సన్‌, కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్ర జ్వరంతో న్యూఢిల్లీలోని సర్‌ గంగారామ్‌ ఆస్పత్రిలో చేరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.  ఈమేరకు ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉందని చికిత్స తీసుకుంటున్నారని సదరు ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.

ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఐతే సోనియా  గురువారమే ఆసుపత్రిలో చేరినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ మేరకు సీనియర్ కన్సల్టెంట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ చెస్ట్ డాక్టర్ అరూప్ బసు మాట్లాడుతూ.. తమ వైద్యుల బృందం ఆమెను దగ్గరుండి మరీ నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.

(చదవండి: కేంద్రంపై రాహుల్‌ గాంధీ సంచలన ఆరోపణలు.. పెగాసెస్‌పై కామెంట్స్‌ ఇవే..)

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు