Ashok Gehlot-Sachin Pilot Photo: పైలట్‌తో కుస్తీకి బై బై..కలిసి గెలుస్తున్నాం

15 Nov, 2023 11:35 IST|Sakshi

జైపూర్‌ : ఆ ఇద్దరు కాంగ్రెస్‌ అగ్రనేతలు మొన్నటిదాకా ఒకరిపై ఒకరు విమర్శల దాడి చేసుకున్నారు. ఎవరికి వారే అన్నట్టు గ్రూపు రాజకీయాలు నడిపారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఎన్నికలు రాగానే పార్టీ కోసం ఒక్కటయ్యారు. తమ మధ్య ఏమీ లేదని,పార్టీ గెలుపే తమ ఉమ్మడి లక్ష్యమని చెబుతున్నారు.ఇద్దరు నేతల్లో ఒకరు రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కాగా, మరొకరు ఆ రాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలట్‌.

తామిద్దరం ఒక్కటే అన్న సంకేతాలను ఇటు పార్టీ క్యాడర్‌కు,అటు ప్రజల్లోకి బలంగా పంపేందుకు బుధవారం ఉదయం రాజస్థాన్‌ సీఎం అశోక్‌గెహ్లాట్‌ ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక ఫొటో షేర్‌ చేశారు. ఈ ఫొటోకు టు గెదర్‌ విన్నింగ్‌ అగెయిన్‌(కలిసి గెలుస్తున్నాం) అనే క్యాప్షన్‌ను జోడించారు. ఈ ఫొటోలో సచిన్‌ పైలట్‌, పార్టీ నేషనల్‌ జనరల్‌ సెక్రటరీ కేసీ వేణుగోపాల్‌తో కలిసి అశోక్‌ గెహ్లాట్‌ చర్చిస్తున్నారు.

అటు సచిన్‌ పైలట్‌ కూడా తాజాగా మీడియాతో మాట్లాడుతూ తనకు గెహ్లాట్‌కు‌ మధ్య ఎలాంటి వివాదాలు లేవని రాజకీయ నాయకులుగా తాము హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. గతంలో పైలట్‌, గెహ్లాట్‌పై చేసిన విమర్శలను గుర్తు చేయగా ‘నేనలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు..ఎవరన్నారో వారే బాధ్యత వహిస్తారు’ అని తోసిపుచ్చారు. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా రాజస్థాన్‌లో ఈ నెల23న పోలింగ్‌ జరగనుంది.

  


ఇదీ చదవండి..ఒక్కసారి డిసైడ్‌ అయితే.. తగ్గేదేలే! రైతు బిడ్డ ఘనత

మరిన్ని వార్తలు