వైరల్ ‌: పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున‍్న పెళ్లికొడుకు

13 May, 2021 12:45 IST|Sakshi

కరోనా వ్యాప్తితో దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌ డౌన్‌ విధించాయి. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో మీరు పెళ్లి చేసుకోండి.. కాకపోతే కరోనా నిబంధనల్ని పాటించాలంటూ ఉత్తర‍్వులు జారీ చేశాయి. దీంతో జరగాల్సిన పెళ్లితంతు పూర్తిగా మారిపోయింది. కరోనాకు ముందు పెళ్లంటే.. పెళ్లి మండపాల్లో చుట్టాలతో కళకళలాడేవి. మేళ తాళాలు కొత్త జీవితానికి శుభం పలుకుతూ ఆహ్వానించేవి. అతిథులు సమక్షంలో నూతన వధూవరులు ఒక్కటయ్యేవారు. కానీ, ఇప్పుడు అదేం లేదు. పెళ్లిళ్లు కళతప్పి ఎవరి పెళ్లి వాళ్లే చేసుకుంటున్నారు. అతిథులు లేకుండానే శుభకార్యాలు జరిగిపోతున్నాయి.

తాజాగా జరిగిన ఓ పెళ్లిలో పెళ్లి కొడుకు తన పెళ్లికి తానే డప్పుకొట్టుకుంటున్నాడు. ఐపీఎస్‌ అధికారి రూపిన్‌ శర్మ ఆ వీడియోను షేర్‌ చేయడంతో  ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పెళ్లి తంతు అనంతరం వధూవరులు పెళ్లి మండపం నుంచి ఇంటికి వచ్చే క‍్రమంలో డప్పు చప్పుళ్లతో, మేళతాళాలతో ఆహ్వానిస్తారు. కానీ రూపిన్‌ శర్మ షేర్‌ చేసిన వీడియోలో పెళ్లి తర్వాత పెళ్లి కుమారుడు డప్పు వాయిస‍్తుంటే పెళ్లి కుమార్తె అతని వైపు చూస్తూ సిగ్గుపడుతుంది. ప‍్రస్తుతం ఆ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.  పెళ్లి కొడుకే కానీ పక్కా ప్రొఫెషనల్‌ డ్రమ్స్‌ వాయిస్తున్నాడని ఓ నెటిజన్‌ అంటుంటే.. నా పెళ్లికి నేను డప్పు కొట‍్టుకుంటున్నా.. మీ పెళ్లికి మీరే డప్పు కొట్టుకోవాలంటూ మరో నెటిజన్ ట్వీట్‌ చేశాడు. పెళ్లికూతురు సిగ్గుపడుతుంటే, పెళ్లికొడుకు పర్ఫామెన్స్‌ ఇరగదీస్తున్నాడంటూ మరోనెటిజన్‌ ఫన్నీ కామెంట్‌ పెట‍్టాడు. 
 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు