బుల్డోజర్‌ని నడుపతూ వచ్చిన వరుడు! ఫోటో వైరల్‌

19 Jun, 2022 21:34 IST|Sakshi

ఇటీవలకాలంలో యువత పెళ్లితంతును చాలా వెరైటీగా చేసుకుంటున్నారు. ఎవరూ చేసుకోని విధంగా, ఊహించని విధంగా ఉండాలనుకుంటున్నారు. అందుకోసం యువత కొత్తట్రెండ్‌ సృష్టిస్తున్నారనే చెప్పాలి. ఇటీవలే ఒక వధువు కళ్యాణ మండపానికి ట్రాక్టర్‌ పై వచ్చి షాకిచ్చింది. ఆ ఘటన మరువుక మునుపే ఇక్కడో పెళ్లికొడుకు బుల్డోజర్‌ పై వచ్చి సందడి చేశాడు.

వివరాల్లోకెళ్తే...పెళ్లి చేసుకునేందుకు వరుడు పెళ్లి కూతురు ఇంటికి మంచి కారులోనో లేదంటే మంచి ఖరీదైన బైక్‌లోనో రావడం జరుగుతుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లోని ఒక యవకుడు తన పెళ్లిని అందరూ గుర్తించుకునేలా ప్రత్యేకంగా ఉండాలని ఏకంగా బుల్డోజర్‌ పై డ్రైవ్‌ చేసుకుంటూ వచ్చాడు. దీంతో పెళ్లికూతురి గ్రామంలోని వాళ్లంతో ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఆ తర్వాత అందరూ ఆ వరుడితో సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు.

ఈ మేరకు వరుడు మాట్లాడుతూ...తాను తన పెళ్లిని గుర్తుండిపోయే ఈవెంట్‌గా మార్చుకోవాలనే ఇలా చేశానని అన్నాడు. పైగా గ్రామమంతా పండుగా వాతావరణం చోటు చేసుకుందంటూ తెగ సంబరపడిపోయాడు. ప్రస్తుతం పెళ్లికొడుకు బుల్డోజర్‌పై వచ్చిన ఫోటో ఆన్‌లైన్‌లో తెగ వైరల్‌ అవుతోంది

(చదవండి: సినిమాలో హీరో మాదిరి కింద పడేశాడు!)

మరిన్ని వార్తలు