Heavy Rains In Mumbai: ముంబైలో వరుణుడి బీభత్సం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

12 Jul, 2022 13:16 IST|Sakshi

ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నగరం అతలాకుతలమైంది. మంగళవారంతో పాటు బుధవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ నగరంలో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

భారీ వర్షాల దాటికి మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో నదులు, డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో పలు ముంపు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

వరదల ధాటికి ఆదివారం సాయంత్రం నాశిక్ జిల్లాలో ఓ వ్యక్తి కొట్టుకుపోయాడు. గ్రామస్థులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.  పీట్‌ తాలూకాకు చెందిన మరో 65 ఏళ్ల వ్యక్తి చిఖ్లీ నది దాటుతుండగా కొట్టుకుపోయాడు. అతను కూడా మరణించి ఉంటాడని స్థానికులు అనుమానిస్తున్నారు.

మరిన్ని వార్తలు