శబరిమలకు పోటెత్తిన భక్తులు.. భారీగా ట్రాఫిక్ జామ్

24 Dec, 2023 12:13 IST|Sakshi

తిరువనంతపురం: శబరిమలకు భక‍్తులు పోటెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచేగాక కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి అధిక సంఖ్యలో భక్తులు వెళుతున్నారు. భక్తుల సంఖ్య అధికంగా పెరగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో ఎరుమేలికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే వాహనాలు నిలిచిపోయాయి. నేడు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఎరుమేలి నుంచి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్నారు. 

రోజుకు లక్ష మందికిపైగా భక్తులు శబరిమలకు రావడం వల్ల తీవ్ర రద్దీ ఏర్పడిందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కె.రాధాకృష్ణన్‌ తెలిపారు. ఇలాంటి సందర్భాల్లో సమస్యలు తలెత్తడం సాధారణమేనని వ్యాఖ్యానించారు. శబరిమలలో సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని స్పష్టంచేశారు.

ప్రత్యేక రైళ్లు..
ఇదిలా ఉండగా.. అయ్యప్ప భక్తుల రద్దీ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శబరిమలకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 51 ప్రత్యేక రైళ్లను కేటాయించింది. ప్రత్యేక రైళ్లు.. డిసెంబర్, జనవరి నెలల్లో వివిధ తేదీల్లో శబరిమలకు చేరుకుంటాయి. 

ఇదీ చదవండి: ఉగ్రదాడిలో రిటైర్డ్ పోలీసు అధికారి మృతి

>
మరిన్ని వార్తలు