కోవిడ్‌ కేసులు పైపైకి

19 Dec, 2023 05:32 IST|Sakshi

అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం సూచన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు నెమ్మదిగా పెరుగుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచనలు జారీచేసింది. కోవిడ్‌ కేసుల్లో పెరుగుదల, కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్‌ జేఎన్‌1 (బీఏ 2.86.1.1) వెలుగుచూసిన నేపథ్యంలో కేంద్రం సోమవారం ముందస్తు చర్యలకు దిగింది.

‘‘ కోవిడ్‌ కేసుల్లో ఉధృతి కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చర్యలు తీసుకోవాలి.  పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాలన్నీ అప్రమత్తంగా ఉండాలి. భారత వాతావరణాన్ని తట్టుకుని వేరియంట్లు విజృంభించేలోపు ముందస్తు చర్యలతో సమాయత్తం అవుదాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి సుధాన్‌‡్ష పంత్‌ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఆదివారం దేశవ్యాప్తంగా ఐదుగురు కోవిడ్‌తో కన్నుమూశారు. కొత్తగా వందలాది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

>
మరిన్ని వార్తలు