చూపు లేకున్నా.. చదువులో రాణిస్తున్న రియాశ్రీ

23 May, 2023 10:28 IST|Sakshi

హోసూరు(బెంగళూరు): గత 19వ తేదీ విడుదలైన పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షా ఫలితాల్లో 470 మార్కులు సాధించి హోసూరు సమీపంలోని నెల్లూరు హైస్కూల్‌లో ఫస్ట్‌ వచ్చిన అంధ విద్యార్థిని రియాశ్రీ (15)ని అందరూ అభినందించారు. హోసూరు ట్రెంట్‌ సిటీ ప్రాంతానికి చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఉద్యోగి అఖిలన్, సుమతి దంపతుల కూతురు రియాశ్రీ.

బాల్యంలోనే కంటి చూపును కోల్పోయింది. అయినప్పటికీ చదువులో మేటిగా రాణిస్తోంది. టెన్త్‌లో పాఠశాలలో ప్రథమురాలిగా నిలిచింది. సబ్‌ కలెక్టర్‌ శరణ్య బాలిక రియాశ్రీని అభినందించారు. తమ కూతురికి కంటి చూపు వచ్చేలా చేయాలని తల్లిదండ్రులు విన్నవించారు.

>
మరిన్ని వార్తలు