దేశవ్యాప్తంగా పేలుళ్లకు కుట్ర.. 8మంది ఐసిస్ ఉగ్రవాదుల అరెస్టు

18 Dec, 2023 17:58 IST|Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా పేలుళ్ల కుట్రను ఎన్‌ఐఏ భగ్నం చేసింది. కర్ణాటక, ముంబయి, ఢిల్లీలో జరిపిన సోదాల్లో 8మంది ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసింది. భారీగా పేలుడు పదార్ధాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకుంది. 

సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్‌పౌడర్ వంటి పేలుడు పదార్థాల నిల్వలు, ప్రతిపాదిత దాడుల వివరాలతో కూడిన పత్రాలు స్వాధీనం చేసుకున్నామని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. బాకులు, నగదు, డిజిటల్ పరికరాల వంటి పదునైన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేశారు. బళ్లారి మాడ్యూల్‌కు చెందిన నాయకుడు మహ్మద్ సులైమాన్‌ అరెస్టైన వాళ్లలో ఉన్నట్లు పేర్కొన్నారు. 

ఉగ్రవాదులు సమాచారం పంచుకోవడానికి IM యాప్‌లను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోపేలుళ్లు జరపడానికి కుట్ర పన్నారని అధికారులు పేర్కొన్నారు. తమ గ్యాంగ్‌లో చేర్చుకోవడానికి కళాశాల విద్యార్థులను కూడా ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని గత వారం ఎన్‌ఐఏ 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: కరాచీ ఆస్పత్రిలో దావూద్ ఇబ్రహీం?

>
మరిన్ని వార్తలు