5 కోట్లకు పెండింగ్‌ కేసులు!

7 Dec, 2022 07:07 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పెండింగ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ కోర్టుల్లో మరో రెండు నెలల్లో పెండింగ్‌ కేసుల సంఖ్య 5 కోట్ల మార్కును దాటనుందని చెప్పారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఇలాంటి కేసులు కొంత తగ్గుముఖం పడుతున్నప్పటికీ కింది కోర్టుల్లో మాత్రం పరిస్థితి సవాలుగానే మారిందని పేర్కొన్నారు.

ఢిల్లీ హైకోర్టులో మంగళవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కిరణ్‌ రిజిజు మాట్లాడారు. కింది కోర్టులను మౌలిక వసతుల కొరత వేధిస్తోందని, అందుకే పెండింగ్‌ కేసులు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. పరిష్కారం కాని కేసులు కొన్ని నెలల క్రితం వరకు 4.83 కోట్లు ఉండేవన్నారు. ఇలాంటి కేసులపై ఎవరైనా తనను ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం చాలా కష్టమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:  జీఎస్టీ అడిషనల్‌ కమిషనర్‌ బొల్లినేని గాంధీపై సస్పెన్షన్‌ వేటు

మరిన్ని వార్తలు