MiG 29K Aircraft Crash: గోవా తీరంలో కుప్పకూలిన మిగ్‌-29కే యుద్ధ విమానం.. పైలట్‌ సురక్షితం

12 Oct, 2022 12:44 IST|Sakshi

పనాజీ: భారత నౌకాదళానికి చెందిన మిగ్‌-29కే ఫైటర్‌ జెట్‌ ప్రమాదానికి గురైంది. గోవా తీరంలో సాధారణ పెట్రోలింగ్‌కు వెళ్లి నేవీ బేస్‌కు తిరిగి వస్తున్న క్రమంలో సముద్రంలో కుప్పకూలిపోయింది. యుద్ధవిమానంలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగానే కూలిపోయినట్లు నౌకదళం వెల్లడించింది. అయితే, ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిన పైలట్‌ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్‌ను రక్షించి ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

మిక్‌-29కే యుద్ధ విమానం ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించింది నేవీ. 2019 నుంచి మిగ్‌-29కే ప్రమాదానికి గురికావటం ఇది నాలుగోది. ఫైటర్‌ జెట్‌లో రష్యా తయారు చేసిన కే-36డీ-3.5 జెట్‌ నుంచి విడిపోయే సీటు ఉంది. ఈ సాంకేతికత ప్రపంచంలోనే అత్యాధునికమైనదిగా చెబుతారు. హ్యాండిల్‌ లాగగానే ముందుగా వెనుక సీట్లో ఉన్న పైలట్‌, ఆ తర్వాత ముందు సీటులోని పైలట్‌ జైట్‌ నుంటి బయటపడతారు.

ఇదీ చదవండి: ‘మాకు 5జీ ఫోన్‌లు కావాలి’, స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థలకు కేంద్రం ఆదేశాలు

మరిన్ని వార్తలు