మద్దతు ధర కమిటీలో నాలుగు సబ్‌ గ్రూపులు

23 Aug, 2022 07:17 IST|Sakshi

న్యూఢిల్లీ: కనీస మద్దతు ధరపై కేంద్రం నియమించిన కమిటీ నాలుగు సబ్‌ గ్రూపులను ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన కమిటీ తొలి భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జీరో బడ్జెట్‌ ఆధారిత సాగు, దేశావసరాలకు అనుగుణంగా పంట విధానాల మార్పు, మద్దతు ధరను మరింత ప్రభావవంతంగా, పారదర్శకంగా మార్చడం వంటి పలు అంశాలపై చర్చ జరిగినట్టు కమిటీ సభ్యుడు బినోద్‌ ఆనంద్‌ మీడియాకు తెలిపారు.

‘‘హిమాలయ రాష్ట్రాల్లో పంటల తీరుతెన్నులపై ఒక సబ్‌ గ్రూపు, సూక్ష్మ సాగును రెండోది, జీరో బేస్డ్‌ సాగును మూడోది, దేశవ్యాప్తంగా పంటల తీరుతెన్నులు, పంటల వైవిధ్యాన్ని నాలుగో సబ్‌ గ్రూపు అధ్యయనం చేసి నివేదికలు అందజేస్తాయి’’ అని వివరించారు. ముందుగా ప్రకటించినట్టుగానే సంయుక్త కిసాన్‌ మోర్చా ఈ భేటీకి దూరంగా ఉంది.

ఇదీ చదవండి: రైతుల ‘మహాపంచాయత్‌’

 

మరిన్ని వార్తలు