అర్నబ్‌ గోస్వామి​కి ఎదురుదెబ్బ

9 Nov, 2020 15:48 IST|Sakshi

సాక్షి, ముంబై : ఇంటీరియర్‌ డిజైనర్‌ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్ట్‌ అయిన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్నాబ్‌ గోస్వామికి మరో​ ఎదురురెబ్బ తగిలింది.  2018 నాటి కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న తనకు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు శుక్రవారం విచారణ జరిపింది. అర్నబ్‌ గోస్వామి బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేని స్పష్టం చేసింది. అలాగే హైకోర్టును ఆశ్రయించేముందుగా అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. అయితే ఇప్పటికే అలీబాగ్‌ సెషన్స్‌ కోర్టులో అర్నాబ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో సంబంధిత పిటిషనపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని న్యాయస్థానం ఆదేశించింది. (అర్నాబ్‌ గోస్వామి అరెస్ట్‌ అన్యాయమేనా!?)

ఆర్కిటెక్ట్‌ అన్వయ్‌ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్యల కేసులో అర్నబ్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు తన భర్త అరెస్ట్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ అతని భార్య అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అర్నాబ్‌కు ముంబై పోలీసుల నుంచి ప్రాణహాని ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు