వారంతా ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌ స్లీపర్‌ సెల్‌ ఏజెంట్స్‌.. బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

3 Sep, 2022 16:04 IST|Sakshi

బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్‌ నటి షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌, స్లీపర్‌ సెల్‌ ఏజెంట్స్‌ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిల్కిస్‌ బానో గ్యాంప్‌ రేప్‌ కేసులో దోషులను విడుదల చేయడంపై ప్రముఖ బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ స్పందించిన విషయం తెలిసిందే. 

ఈ నేపథ్యంలో షబానా అజ్మీ వ్యాఖ్యలపై మధ్యప్రదేశ్‌ హోంశాఖ మంత్రి నరోత్తం మిశ్రా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ పాలిత రాష్ట్రంలో ఏదైనా జరిగితే వీరంతా మాట్లాడేందుకు ముందుకు వస్తారు. మిగతా రాష్ట్రాల్లో ఏం జరిగినా వీరికి పట్టదు. రాజస్థాన్‌లో కన్హయ్య లాల్‌ను హత్య చేశారని, అప్పుడు వారి నోటి నుంచి ఒక్క మాట కూడా లేదని, జార్ఖండ్‌లోని దుమ్కాలో బాలికను సజీవ దహనం చేసిన సమయంలో మౌనంగా ఉన్నారంటూ మండిపడ్డారు.

అలాగే, వీరంతా తమ చెడు మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ.. దీన్ని నాగరికత, సెక్యులర్‌ అని అనడం ఎంత వరకు కరెక్ట్‌ అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే షబానా అజ్మీతో పాటు జావేద్ అక్తర్, నసీరుద్దీన్ షాను ‘తుక్డే తుక్డే’ గ్యాంగ్‌ స్లీపర్‌ సెల్‌ ఏజెంట్స్‌ అంటూ విమర్శించారు. అదే సమయంలో వీరిని అవార్డ్ వాప్సీ గ్యాంగ్ అని కూడా అన్నారు. 

మరిన్ని వార్తలు