Neelam Gorhe: శిందే వర్గంలో చేరే ప్రసక్తే లేదు.. ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలోనే కొనసాగుతా 

21 Nov, 2022 11:15 IST|Sakshi

సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే వర్గంలో తాను చేరే ప్రసక్తే లేదని శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గానికి చెందిన మహిళా నేత రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌ నీలమ్‌ గోర్హె స్పష్టం చేశారు. తానెప్పటికీ శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గంలోనే కొనసాగుతానని వెల్లడించారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ...తాను శిందే వర్గంలో చేరబోతున్నానంటూ మీడియా ఆధారాల్లేని వార్తల్ని రాసిందని, ఆ వార్తల్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు.

శ్రద్ధావాకర్‌ హత్యకేసులో అఫ్తాబ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం సమర్పించేందుకు మాత్రమే లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిశానని, ఆ భేటీలో ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవని ఆమె వెల్లడించారు. అదేవిధంగా అదే కార్యక్రమంలో సీఎం శిందే, రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాహుల్‌ నర్వేకర్‌లు కూడా పాల్గొని బిర్లాను కలిశారని తెలిపారు.  
చదవండి: నానాటికీ పెరుగుతున్న విద్యుత్ ఛార్జీలు.. గుజరాత్‌లో బీజేపీకి షాక్ తగులుతుందా?

మరిన్ని వార్తలు