గెలవాలనుకుంటే నితీశ్‌, నిశ్చయం.. రెండూ కావాలని పోస్టర్లు

19 Dec, 2023 10:54 IST|Sakshi
photo credit:​HINDUSTAN TIMES

పాట్నా: ఇండియా కూటమి కీలక సమావేశం ఢిల్లీలో మంగళవారం(డిసెంబర్‌ 19) జరగనుంది. రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఈ సమావేశంలో జరుగుతాయని తెలుస్తోంది. 

ఓ వైపు ఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం నేపథ్యంలో పాట్నాలో వెలిసిన జేడీయూ చీఫ్‌, బీహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ పోస్టర్లు చర్చనీయాంశమవుతున్నాయి.‘ ఎన్నికల్లో నిజంగా గెలవలానుకుంటే ధృడ నిశ్చయం కావాలి. నితీశ్‌ కుమార్‌ కావాలి’ అని పోస్టర్లపై రాశారు. ఇండియా కూటమికి నితీష్‌ నాయకత్వం కావాలని అర్థం వచ్చేటట్లుగా ఈ పోస్టర్లున్నాయని పలువురు భావిస్తున్నారు. 

తనకు ఎలాంటి పదవులు అవసరం లేదని నితీశ్‌ కుమార్‌ పలుమార్లు చెప్పినప్పటికీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి నితీశ్‌ కుమారేనన్న పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిపై స్పందించారు. ఎన్నికల తర్వాతే ప్రధాని అభ్యర్థిని నిర్ణయిస్తామని మమత చెప్పడం గమనార్హం. 

ఇదీచదవండి..భారత్‌లో కరోనా: జేఎన్‌.1 వేరియెంట్‌ లక్షణాలేంటి?

>
మరిన్ని వార్తలు