ఆఫీస్‌లో కాసేపు పడుకోనివ్వండి!

19 Dec, 2023 11:00 IST|Sakshi

ఆఫీస్‌ టైమ్‌లో చేసేపని కాస్త చాలెంజింగ్‌గా ఉంటే నిద్రకు అవకాశం ఉండదు. కానీ వర్క్‌లో ఎలాంటి చాలెంజ్‌ లేకుండా కూర్చొని చేసే కొన్ని పనుల్లో చాలాసార్లు నిద్ర వస్తూంటుంది. దాంతో ఉత్పాదకత తగ్గుతుంది. 

ఆఫీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో కొంతసేపు నిద్రపోవడానికి  అవకాశమిస్తే ప్రొడక్టివిటీ బాగా పెరుగుతుందని మెజార్టీ ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే జపాన్‌లో ఈ సంప్రదాయం ఉంది. పని బాగా చేయడానికి, అలసట నుంచి బయటపడేందుకు ఆఫీస్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో  కొద్ది సేపు నిద్రపోవడం ముఖ్యమని తాజాగా జీనియస్ కన్సల్టెంట్‌‌‌‌ సర్వేలో ఉద్యోగులు పేర్కొన్నారు. ఆఫీస్‌‌‌‌ టైమ్‌‌‌‌లో న్యాప్‌‌‌‌ (కునుకు తీయడం) బ్రేక్  ఇవ్వడం ముఖ్యమని 94 శాతం మంది చెప్పారు.

మూడు శాతం మంది మాత్రం ఇలాంటి అభిప్రాయానికి వ్యతిరేకంగా ఓటేశారు.  ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో చేసిన ఈ సర్వేలో మొత్తం 1,207 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 25–అక్టోబర్‌‌‌‌‌‌‌‌ 27 మధ్య ఈ సర్వే చేసినట్లు జీనియస్ వెల్లడించింది. బ్యాంకింగ్‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌, కన్‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌, ఇంజినీరింగ్‌‌‌‌, ఎడ్యుకేషన్‌‌‌‌, ఎఫ్‌‌‌‌ఎంసీజీ, హాస్పిటాలిటీ, హెచ్‌‌‌‌ఆర్ సొల్యూషన్స్‌‌‌‌, ఐటీ, ఐటీఈఎస్‌‌‌‌, బీపీఓ, లాజిస్టిక్స్‌‌‌‌, మాన్యుఫాక్చరింగ్‌‌‌‌, మీడియా, ఆయిల్‌‌‌‌ అండ్‌‌‌‌ గ్యాస్‌‌‌‌, ఫార్మా  కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల అభిప్రాయాలను  సేకరించింది. 

ఈ రిపోర్ట్ ప్రకారం, ఆఫీస్‌‌‌‌ అవర్స్‌‌‌‌లో కొంత సేపు నిద్రపోతే పని సామర్ధ్యం మెరుగవుతుందని 82 శాతం మంది  చెప్పగా, 12 శాతం మంది దీనికి వ్యతిరేకంగా మాట్లాడారు. రోజువారి పనిలో అలసట, ఆయాసం వంటివి ఎదుర్కొంటున్నామని 60 శాతం మంది చెప్పారు. మరో 27 శాతం మంది మాత్రం తమకు అలసట లేదని పేర్కొన్నారు. ఒక గంట పాటు పడుకోవడానికి టైమ్ ఇస్తే అదనపు అవర్స్‌‌‌‌లో పనిచేసేందుకు తమకు ఓకే అని 49 శాతం మంది వెల్లడించారు. కానీ 36 శాతం మంది మాత్రం ఈ ఆలోచన బాగోలేదన్నారు. 

జపాన్‌‌‌‌లో పాటించే ‘ఇనెమురి (ఆఫీస్ అవర్స్‌‌‌‌లో పడుకోవడం)’ విధానం మంచిదని, దాంతో ఉద్యోగుల ఆరోగ్యం మెరుగవుతుందని 78 శాతం మంది పేర్కొన్నారు. ఆఫీస్ అయిపోయాక పడుకోవడానికి వీలు కలిపిస్తే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగుంటుందని 64 శాతం మంది చెప్పగా, దీని వలన ఎటువంటి ఉపయోగం లేదని 21 శాతం మంది అన్నారు.

ఇదీ చదవండి: రూ.55 వేలకోట్ల దావూద్‌ఇబ్రహీం వ్యాపార సామ్రాజ్యం ఇదే..

>
మరిన్ని వార్తలు