ఓఎన్‌జీసీ మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్స్‌

1 Sep, 2021 21:00 IST|Sakshi

ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు  ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌(ఓఎన్‌జీసీ) ఫౌండేషన్‌ సీఎస్‌ఆర్‌ కింద స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. దీనిలో భాగంగా 2021–21 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం మెరిటోరియస్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు సెప్టెంబర్‌ 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చు. (ఏపీఈపీడీసీఎల్: జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలు)

అర్హతలు
► ఇంజనీరింగ్, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ లేదా మాస్టర్స్‌ ఇన్‌ జియోఫిజిక్స్‌/జియాలజీ ప్రోగ్రామ్స్‌లలో మొదటి ఏడాది చదివే వారు, అలాగే గత అకడమిక్‌ పరీక్షల్లో కనీసం 60 శాతం సీజీపీఏ/ఓజీపీఏ సాధించిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌ దరఖాస్తు అర్హులు. (ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి)

► జనరల్‌/ఓబీసీ కుటుంబ వార్షికదాయం రూ. 2 లక్షలకు మించకుండా ఉండాలి. ఎస్సీ/ఎస్టీలు అయితే రూ.4.5లక్షలకు మించకూడదు.

► వయసు: జులై 1 నాటికి 30ఏళ్లకు మించకుండా ఉండాలి.

స్కాలర్‌షిప్‌
► ప్రోగ్రామ్‌ కింద అర్హులైన 500 మంది విద్యార్థులను ఎంపిక చేసి.. ఏడాదికి రూ.48000 అంటే నెలకు రూ.4000 చొప్పున స్కాలర్‌షిప్‌గా అందిస్తారు. ఇందులో 50 శాతం స్కాలర్‌షిప్స్‌ను అమ్మాయిలకు కేటాయిస్తారు. 

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ అండ్‌ పోస్ట్‌ ద్వారా పంపాలి.

► దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబర్‌ 5, 2021

► వెబ్‌సైట్‌: https://ongcscholar.org/#/

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు