ఫ్రేమ్‌ ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్‌.. తాడే గట్టుకు చేర్చే లిఫ్ట్‌

1 Aug, 2021 08:48 IST|Sakshi

హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా లాహౌల్‌ స్పితిలో వరదలు సంభవించాయి. వరదల కారణంగా జహ్‌మాలా కాలువకు ఒకవైపు చిక్కుకుపోయిన వారిని తాళ్ల ద్వారా మరో వైపుకు చేరుస్తున్న దృశ్యం


చూడ్డానికి ఫ్రేమ్‌లో ఉన్న బొమ్మలా కనిపిస్తున్న ఈ దృశ్యం జర్మనీలోని ఓ పార్కులో తీసింది. పార్కులోని సోయగాలను మరింత అందంగా చూపేందుకు ఫ్రేమ్‌ ఆర్ట్‌ ఇన్‌స్టాలేషన్‌ చేశారు. దీంతో ఫ్రేమ్‌ వెనుక ఉన్న ప్రాంతమంతా త్రీడీ చిత్రంలా కనిపిస్తుంది.

నాసా వ్యోమగాములతో చంద్రునిపైకి వెళ్లే మొదటి స్పేస్‌ఎక్స్‌ స్టార్‌షిప్‌ హ్యూమన్‌ ల్యాండర్‌ డిజైన్‌ చిత్రమిది. స్పేస్‌ఎక్స్‌ దీనిని విడుదల చేసింది. ఆర్టెమిస్‌ ప్రోగ్రాం కింద నాసా ప్రకటించిన 20 వేల కోట్ల కాంట్రాక్టును జెఫ్‌ బెజోస్‌కు చెందిన సంస్థను కాదని ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌కు అప్పగించినట్లు అమెరికా ప్రభుత్వ అకౌంటబిలిటీ కార్యాలయం ప్రకటించింది.

మరిన్ని వార్తలు