Ayodhya Ram Mandir: తొలి రోజు రాములోరి నిద్ర 15 నిముషాలే!

24 Jan, 2024 13:38 IST|Sakshi

అయోధ్య నగరి త్రేతాయుగాన్ని తలపిస్తోంది.  మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడు రాజభవనంలో ఆశీనులు కాగా, లక్షలాది మంది రామభక్తులు ఆయన దర్శనం కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా కాషాయ వస్త్రాలు, కాషాయ జెండాలు కనిపిస్తున్నాయి. అంతటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి. బాలరాముడు అద్భుతమైన భవనంలో కూర్చుని, భక్తులకు దర్శనం ఇస్తున్నాడు. తొలిరోజు రామ్‌లల్లా దినచర్య ఎలా గడిచిందంటే..

నూతన రామాలయంలో శ్రీరాముడు ఐదేళ్ల చిన్నారి రూపంలో కొలువయ్యాడు. రామనంది సంప్రదాయం ప్రకారం బాలరామునికి సేవలు, పూజలు జరుగుతున్నాయి. రోజంతా బాలరామునికి ఐదు హారతులు అందిస్తున్నారు. అలాగే నైవేద్యాలు సమర్పిస్తున్నారు. తొలిరోజు రామ్‌లల్లా రెండు గంటలపాటు కూడా గంటలు నిద్రపోలేదు. లక్షల సంఖ్యలో వచ్చిన భక్తులకు నిరంతరం దర్శనం ఇస్తూనే ఉన్నాడు. కేవలం 15 నిముషాలు మాత్రమే రామ్‌లల్లా నిదురించాడు. అనంతరం దర్శన ద్వారాలు తెరుచుకున్నాయి.

రామమందిరం ప్రధాన పూజారి ఆచార్ సత్యేంద్ర దాస్ మాట్లాడుతూ ‘రాముడు తన భవ్యమైన భవనంలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. త్రేతాయుగం మళ్లీ ప్రారంభమైనట్లుంది. ఐదేళ్ల రూపంలోని బాలరాముని విగ్రహం చూడగానే ఉప్పొంగిపోయాను. తొలిరోజు బాలరాముడు రెండు గంటలపాటు నిద్రించాల్సి ఉండగా,  భక్తుల రద్దీ దృష్ట్యా  కేవలం 15 నిమిషాల తర్వాత ఆలయ తలుపులు తెరవాల్సి వచ్చింది. లక్షలాది మంది రామభక్తులు నిరంతరం బాలరాముని సందర్శించుకుంటున్నారు’ అని అన్నారు.
 

whatsapp channel

మరిన్ని వార్తలు