దుర్మార్గుడు.. కుక్క పిల్లలను బైకుతో తొక్కి చంపాడు

19 Jun, 2021 17:43 IST|Sakshi

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రాలో క్రూర ఘటన చోటుచేసుకుంది. మానవత్వం మరిచిన ఓ వ్యక్తి మూగ జీవుల ప్రాణాలను అన్యాయంగా బలితీసుకున్నాడు. ఆగ్రాలోని సికందరా ప్రాంతంలో రోడ్డు మీద ఆడుకుంటున్న రెండు కుక్కపిల్లలను బైక్‌పై వెళుతున్న గుర్తుతెలియని వ్యక్తి బైకుతో ఉద్దేశ్య పూర్వకంగా తొక్కి చంపేశాడు.  ఈ ఘటన జూన్ 14న రాత్రి 10.30 గంటల సమయంలలో జరగగా.. సీసీటీవీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలు ఒళ్లు గగుర్పుడిచేలా ఉన్నాయి.. వీడియోను పరిశీలిస్తే.. ముందుగా అతడు రోడ్డు మీద ఆడుకుంటున్న ఓ కుక్క పిల్ల మీదకు బైకు స్పీడ్‌గా ఎక్కించాడు. ఆ ప్రమాదంలో కుక్క పిల్లకు కొంతగాయమవ్వగా. అడ ఉన్న ఆ కుక్క పిల్ల తల్లి, మిగతా కుక్కలన్నీ దాని చుట్టూ చేరాయి. 

అదే సమయంలో అదే బైకర్ మళ్లీ వెనక్కి వచ్చి.. మరో కుక్క మీద నుంచి తొక్కుకుంటూ వేగంగా వెళ్లిపోయాడు. ఈ ఘటన ఆ రోడ్డు పక్కన ఉన్న ఓ ఇంటి సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనస్సును కదిలిస్తోంది. దుండగుడు చేసిన పనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనికరం లేకుండా ప్రవర్తించిన సదరు దుర్మార్గుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా పోలీసులు గుర్తుతెలియని వ్యక్తి మీద ‘జంతువులపై క్రూరత్వం నివారణ చట్టం’ కింద కేసు నమోదు చేశారు.

చదవండి: 123 రోజులు సంకెళ్లతో.. ప్రపంచంలో ఏ జంట ఈ పని చేసుండదు?
భార్య కోసం ప్రేమగా గజల్‌ పాడుతున్న భర్త.. కానీ ఆమె మాత్రం!

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు