SpiceJet Emergency Landing: స్పైస్‌ జెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపం...కరాచీలో అత్యవసర ల్యాండింగ్‌

5 Jul, 2022 16:24 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్తున్న స్పైస్‌ జెట్‌ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే విమానాన్ని దారి మళ్లించి కరాచి ఎయిర్‌పోర్ట్‌లో అ‍త్యవసరంగా ల్యాండ్‌ చేశారు. ఐతే స్పైస్‌జెట్‌ విమానంలో ఇండికేటర్‌ లైట్‌ సరిగా పనిచేయకపోవడంతోనే కరాచికి మళ్లించినట్లు ఎయిర్‌లైన్‌ అధికార ప్రతినిధి తెలిపారు.

ఎలాంటి ఎమర్జెన్సీ ప్రకటించలేదని విమానయాన సంస్థ పేర్కొంది. అంతేకాదు ప్రయాణీకులను దుబాయ్‌కి తీసుకువెళ్లే ప్రత్యామ్నాయ విమానాన్ని కరాచీకి పంపుతున్నామని ఎయిర్‌లైన్ ప్రతినిధి తెలిపారు. ఐతే  అసాధారణంగా ఇంధనం తగ్గుతున్నట్లుగా  ఇండికేటర్‌ని చూపించడంతో, పైలట్‌లు ఇంధనం లీకేజ్‌ అవుతుందన్న అనుమానంతో విమానాన్ని దారి మళ్లించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తెలిపింది. విమానం ల్యాండ్ అయిన తర్వాత ఇంధనం లీక్ అయినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని ఏవియేషన్ రెగ్యులేటర్ పేర్కొంది.

(చదవండి: నైట్‌ క్లబ్‌లో కాల్పుల కలకలం...ప్రమాదవశాత్తు స్నేహితుడిని కాల్చిన వ్యక్తి)

మరిన్ని వార్తలు