రిసార్ట్‌ పాలిటిక్స్‌.. తొలిసారి ఎక్కడ ఎప్పుడంటే..?

5 Feb, 2024 17:06 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశంలో పార్లమెంట్‌ ఎన్నికల ముందు రిసార్ట్‌ పాలిటిక్స్‌ ఊపందుకున్నాయి. జార్ఖండ్‌కుచెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆదివారం వరకు హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో క్యాంపు వేసిన విషయం తెలిసిందే. సోమవారం జార్ఖండ్‌ అసెంబ్లీలో జరిగిన చంపయ్‌ సోరెన్‌ బల పరీక్షలో వారు పాల్గొని సర్కారును విజయవంతంగా గట్టెక్కించారు.

జార్ఖండ్‌ సంక్షోభం ఇలా తెరపడగానే బీహార్‌లో నితీశ్‌కుమార్‌ ఆధ్వర్యంలోని జేడీయూ,బీజేపీ సర్కారు బలనిరూపణ అంశం తెరపైకి వచ్చింది. ఈ నెల 12న జరిగే నితీశ్‌ సర్కారు బలపరీక్షకు ముందు పార్టీ ఎమ్మెల్యేలను ఎక్కడ లాక్కుంటారో అన్న భయంతో కాంగ్రెస్‌ తమ 16 మంది ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌కు తరలించింది.

రిసార్ట్‌లలో క్యాంపు ఎన్ని రోజులుంటే అన్ని రోజులు ఎమ్మెల్యేలకు రాజకీయ పార్టీలు సకల లగ్జరీ సౌకర్యాలు, వసతులు కల్పిస్తాయి. అదే సమయంలో వారిపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు వారికి కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తారు. దేశ్యాప్తంగా రిసార్ట్‌ పాలిటిక్స్‌ పాపులర్‌గా మారాయి.

అసలు దేశంలోనే తొలిసారిగా 1982లో రిసార్ట్‌ పాలిటిక్స్‌ హర్యానాలో ప్రారంభమయ్యాయి. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌ఎల్‌డీ,బీజేపీ కూటమికి 37 సీట్లు రాగా, దేశంలోనే శక్తివంతమైన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు 36 సీట్లు వచ్చాయి.

ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సిందిగా అప్పటి గవర్నర్‌ కాంగ్రెస్‌ను ఆహ్వానించడంతో తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఐఎన్‌ఎల్‌డీ హైకమాండ్‌ ఎమ్మెల్యేలందరినీ హిమాచల్‌ ప్రదేశ్‌లోని సొలాన్‌లోని ఓ రిసార్టుకు తరలించి దేశంలోనే తొలిసారిగా రిసార్టు రాజకీయాలకు నాంది పలికింది. 

ఇదీచదవండి.. విశ్వాస పరీక్ష నెగ్గిన చంపయ్‌ సర్కారు 

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega