Tamil Nadu:పెళ్లై ఏడాది.. నదిలో కొట్టుకుపోయిన గర్భిణీ మృతి

6 Nov, 2021 20:36 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, చెన్నై: తమిళనాడులోని కలక్కాడు ప్రాంతంలో వరద నీటిలో కొట్టుకుపోయిన గర్భిణీ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నెల్‌లై జిల్లా కలక్కాడు ప్రాంతంలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కలక్కాడు, నాంగునేరి ఏటీలో ప్రవాహం ఉద్ధృతమైంది. చిదంబరపురం రోడ్డులోని నేల వంతెన నీటిలో మునిగిపోవడంతో కలక్కాడు, చిదంబరంపురానికి రాకపోకలు స్తంభించాయి. కల్లక్కాడు సమీపం చిదంబరపురానికి చెందిన మురుగన్‌ తన కుమార్తె లేఖ(23) అల్లుడు కుమరి జిల్లా నాగర్‌ కోవిల్‌ సీరంకుడికి చెందిన పరమేశ్వరన్‌ను దీపావళికి ఆటోలో తీసుకొచ్చాడు. వంతెన వద్దకు చేరుకునే సరికి చీకటి అయింది.
చదవండి: ముగ్గురు డెంటిస్టులున్నా.. ఒక్కరూ చూడలే..చివరికి!

ప్రవాహ ఉద్ధృతిని గుర్తించలేక ఆటోనుంచి దిగి పరమేశ్వరన్‌, లేఖ, మురుగన్‌, మురుగన్‌ కుమారుడు భరత్‌ వంతెన దాటేందుకు ప్రయత్నించారు. వరద ఉద్ధృతి పెరగడంతో నలుగురు కొట్టుకుపోయారు. మురుగన్‌, భరత్‌, పరమేశ్వరన్‌ ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. లేఖ జాడ లేదు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని లేఖ కోసం గాలించారు. అర్థరాత్రి సమయంలో కాలువలో ఓ చెట్టుకు చిక్కుకుని ఉన్న లేఖ మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. లేఖకు పరమేశ్వరన్‌కు గత జనవరిలో వివాహమైంది. ఆమె ఆరు నెలల గర్భిణి.
చదవండి: భార్య వివాహేతర సంబంధం.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య.. 12 గంటల్లోనే

>
మరిన్ని వార్తలు