రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై తేజస్వీ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు

17 Jul, 2022 15:22 IST|Sakshi

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక విపక్షలా అభ్యర్థగా యశ్వంత్‌ సిన్హా పోటీ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ నిర్వహిస్తారు. జూలై 21న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. 

ఇదిలా ఉండగా.. అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై ఆర్జేడీ చీఫ్‌ తేజస్వీ యాదవ్‌ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తేజస్వీ యాదవ్‌ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవనంలో విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్డీయే మద్దతున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఒక్క ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించలేదు. కనీసం అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా ఆమె మాట్లాడలేదు. అందుకే రాష్ట్రపతి భవన్‌లో ‘విగ్రహం’ అవసరం లేదంటూ ఆమెపై పరోక్షంగా విమర్శలు చేశారు.

ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మాత్రం మాట్లాడటం అందరూ చూసే ఉంటారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు తేజస్వీ యాదవ్‌ ఇ‍ప్పటికే.. మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక, ద్రౌపది ముర్ము ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అజయ్‌ కుమార్‌ కూడా విమర్శలు చేశారు. 

ఇది కూడా చదవండి: వ్యవ'సాయం'పై..అమిత్‌ షా ఆసక‍్తికర వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు