టాప్‌ న్యూస్‌.. నేటి విశేషాలు

5 Jan, 2021 17:51 IST|Sakshi

దీదీకి షాక్‌.. మరో ఎమ్మెల్యే రాజీనామా
పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే సీనియర్‌ నేత సువేందు అధికారి టీఎంసీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మంత్రి పార్టీకి రాజీనామా చేశారు. పూర్తి వివరాలు..

త్వరలోనే అసలు రంగు బయటపడుతుంది’
రామతీర్థం ఘటనపై విచారణలో అసలు రంగు బయటపడుతుందని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రామతీర్థం ఘటన జరిగిన వెంటనే మేం స్పందించామని, ఆలయ ఛైర్మన్ అశోక్‌గజపతిరాజు ఎందుకు వెళ్లలేదని మంత్రి బొత్స ప్రశ్నించారు. పూర్తి వివరాలు..

లోకేష్‌ మాటలకు బాడీ లాంగ్వేజ్‌కి సంబంధముందా..?
చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇప్పటిదాకా.. వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి మండిపడ్డారు. పూర్తి వివరాలు..

పీసీసీపై జీవన్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణా రాజకీయాల్లో పరిచయం అక్కరలేని సీనియర్ కాంగ్రెస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ కరడుగట్టిన కాంగ్రెస్ నేతగా, రాజకీయాల్లో మచ్చలేని నాయకునిగా ప్రాచుర్యం పొందిన జీవన్ రెడ్డికి పుట్టిన రోజు కానుకగా అధిష్టానం పీసీసీ అధ్యక్ష పదవిని బహుమానంగా ఇవ్వనుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పూర్తి వివరాలు..

పేదవాళ్ల ఉసురు తగులుతుంది: సీఎం జగన్‌
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇళ్ల స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణం ప్రారంభం కార్యక్రమం జనవరి 20 వరకూ కొనసాగించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు..

బీజేపీ ముట్టడి: ప్రగతి భవన్‌ వద్ద ఉద్రిక్తత
ప్రగతి భవన్‌ వద్ద  ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొత్తగా ఎన్నికైన  బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం  ప్రగతి భవన్‌ ముట్టడికి యత్నించారు. పూర్తి వివరాలు..

గుడ్‌న్యూస్: ఈ నెల 13 నుంచి వ్యాక్సినేషన్‌
దేశంలో కరోనావైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ గురించి పలు ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్‌లో ఈ నెల 13 నుంచి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. పూర్తి వివరాలు..

29 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 29 నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరి 15 వరకు బడ్జెట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. పూర్తి వివరాలు..

భారత్‌పై డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ ప్రశంసలు!
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ గేబ్రియేసస్‌ భారత్‌పై ప్రశంసలు కురిపించారు. మహమ్మారి కోవిడ్‌-19 కట్టడికై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాత్మక చర్యలు భేష్‌ అని కొనియాడారు. పూర్తి వివరాలు..

‘దాదా బోలే’ యాడ్‌ : ట్రోలింగ్‌ దుమారం
ప్రస్తుత టెక్‌ యుగంలో సోషల్‌ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తమకు నచ్చని అంశంపైన మాత్రమే గాకుండా, కొన్నిసునిశితమైన అంశాలను కూడా నెటిజన్లు  పట్టేస్తారు. తాజాగా వినియోగదారులను బుట్టలో పడేసే వ్యాపార ప్రకటనలపై  కూడా స్పందించడమే కాదు ట్రోలింగ్‌తో ట్రెండ్‌ క్రియేట్‌ చేశారు. పూర్తి వివరాలు..

'మాధవన్‌ మద్యం, డ్రగ్స్‌కు బానిసయ్యాడు!'
సినీ సెలబ్రిటీలు ట్రోలింగ్‌ బారిన పడటం సర్వసాధారణమైంది. తాజాగా ఈ లిస్టులో హీరో మాధవన్‌ వచ్చి చేరారు. ప్రస్తుతం తను నటించిన మారా రిలీజ్‌ కోసం ఎదురు చూస్తున్న ఆయనను సోషల్‌ మీడియాలో ఓ నెటిజన్‌ కించపరుస్తూ మాట్లాడింది. పూర్తి వివరాలు..

పాపం టీ20 తరహాలో ఆడాడు.. ట్విస్ట్‌ ఏంటంటే
టెస్టు మ్యాచ్ అంటేనే జిడ్డు ఆటకు మారుపేరు.బ్యాట్స్‌మెన్లు గంటలకొద్ది క్రీజులో నిలబడి బౌలర్ల ఓపికను పరీక్షిస్తూ మ్యాచ్‌లను ఓటమి నుంచి గట్టెక్కించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ టెస్టు క్రికెట్‌లో వన్డే తరహా ఇన్నింగ్స్‌లను చూడడం అరుదు.. అలాంటిది  పాకిస్తాన్‌ బ్యాట్స్‌మన్‌ మాత్రం టీ20 తరహా ఇన్నింగ్స్‌తో అదుర్స్‌ అనిపించాడు. పూర్తి వివరాలు..

మరిన్ని వార్తలు