దిగొస్తున్న టమాటా ధర

19 Aug, 2023 06:07 IST|Sakshi

సెపె్టంబర్‌ రెండో వారానికి కిలో రూ.30 చేరుతుందని అంచనా

సాక్షి, న్యూఢిల్లీ: నెల రోజులుగా వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న టమాటా ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. టమాటా అధికంగా పండించే ఆంధ్రప్రదేశ్‌ సహా మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హరియాణా రాష్ట్రాల నుంచి సరఫరా పెరగడంతో ధరలు క్రమంగా దిగొస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. గత జూలైలో కిలో ఏకంగా రూ.250 పలికిన టమాటా ధర ప్రస్తుతం రూ.100–120 మధ్యకు చేరుకుందని తెలిపింది.

ఈ ధరలు వచ్చే సెపె్టంబర్‌ రెండో వారానికి సాధారణ స్థాయికి అంటే కిలో రూ.30–40కి చేరుకుంటాయని అంచనా వేసింది. మహారాష్ట్ర నాసిక్‌లోని పింపాల్‌గావ్‌ బస్వంత్‌ మార్కెట్‌కు వారం రోజులుగా టమాటా రాక ఆరు రెట్లు పెరిగిందని అధికారులు తెలిపారు. బెంగళూరు వంటి కీలక మార్కెట్లకు కూడా ట మాటా సరఫరా పెరిగింది. ఢిల్లీలో మొన్నటివరకు కిలో రూ.220గా ఉన్న టమాటా ధర శుక్రవారం రూ.100 వరకు పలికింది.

మరిన్ని వార్తలు