Trending Top 10 News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 న్యూస్‌

6 May, 2022 09:56 IST|Sakshi

1. ఇంటర్‌ పరీక్షలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్‌ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 24 వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వ ఆదేశాలతో ఇంటర్‌ బోర్డు పటిష్ట ఏర్పాట్లు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. నిర్దేశిత తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. భళా తందనాన మూవీ రివ్యూ

సినిమా ఫలితంతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ పోతున్నాడు నటుడు శ్రీవిష్ణు. లేటెస్ట్‌గా ‘బాణం’ఫేం చైతన్య దంతులూరి దర్శకత్వంలో భళా తందనానా చిత్రంతో ముందుకొచ్చాడు. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేర ఆకట్టుకోగలిగింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


3. యూదుల రక్తం కామెంట్లు.. పుతిన్‌ సారీ 

ఉక్రెయిన్‌ అధ్యక్షుడిపై కామెంట్లు చేసే తరుణంలో.. హిట్లర్‌లోనూ యూదుల రక్తం ఉందంటూ రష్యా విదేశాంగ మంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పుతిన్‌, ఇజ్రాయెల్‌కు క్షమాపణలు తెలియజేసినట్లు సమాచారం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


4. ఐస్‌క్రీమ్‌ అమ్ముతున్న ఛాంపియన్‌ సచిన్‌

నేషనల్‌ చాంపియన్‌(పారా అథ్లెట్‌) సచిన్‌ సాహు.. జీవనోపాధి కోసం ఐస్‌క్రీమ్‌ బండి నడుపుకుంటున్నాడు. ప్రభుత్వం తనకు ఎలాంటి సాయం అందకపోవడంతో తాను ఇలా ఐస్‌క్రీమ్స్‌ అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5.టాటా ఈవీ.. భలే బుకింగ్స్‌

టాటా ఎలక్ట్రిక్‌ వెహికల్‌,లాంచ్‌ చేసిందో లేదో.. హాట్‌ కేకుల్లా బుకింగ్స్‌ జరిగిపోతున్నాయి. ఒకసారి చార్జింగ్‌ చేస్తే 154 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. 39,000 యూనిట్ల ఏస్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల సరఫరాకు ఇప్పటికే ఆర్డర్‌ దక్కించుకుంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ముంబై ఇండియన్స్‌ జట్టులోకి ట్రిస్టన్‌ స్టబ్స్‌

ముంబై ఇండియన్స్‌ పేసర్‌ టైమల్‌ మిల్స్‌ గాయం కారణంగా తప్పుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సీజన్‌లో మిగితా మ్యాచ్‌లకు మిల్స్‌ స్థానంలో సౌతాఫ్రికా యువ ఆటగాడు ట్రిస్టన్‌ స్టబ్స్‌ను భర్తీ చేయనుంది. దేశీవాళీ క్రికెట్‌లో అదరగొడతున్న ట్రిస్టన్‌ స్టబ్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి


7. ఉన్నత శిఖరాలపై ప్రియాంక.. రికార్డులు బ్రేక్‌

భారత ఖ్యాతిని మరోసారి ఓ యువతి ప్రపంచానికి మరోసారి చాటి చెప్పింది. తన పేరిటి సరికొత్త రికార్డును సృష్టించింది. మహారాష్ట్రలోని సతారాకు చెందిన ప్రియాంక మోహితే(30) ప్రపంచంలో మూడో ఎత్తైన శిఖరం కాంచనజంగను (8,586 మీటర్లు) గురువారం అధిరోహించారు. దీంతో ప్రపంచంలోని ఐదు.. 8,000 మీటర్ల కంటే ఎతైన శిఖరాలను అధిరోహించిన తొలి భారత మహిళగా ప్రియాంక ఘనత సాధించారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. కోవిడ్‌ మరణాలు.. భారత్‌లో లెక్క పదిరెట్లు ఎక్కువే?!

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా ప్రత్యక్షంగా లేదంటే.. పరోక్షంగా 1.49 కోట్లమంది ప్రాణాలు కోల్పోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ గురువారం ప్రకటించింది. అందులో భారత్‌లో కరోనా మరణాలు 47 లక్షలని తెలిపింది. కానీ, భారత్‌ ఈ ప్రకటనను తీవ్రంగా ఖండిస్తోంది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. మమత, అమిత్‌ షా పరస్పర విమర్శలు

బెంగాల్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్‌షా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య గురువారం మాటల యుద్ధం నడిచింది. కట్‌మనీ, రాజకీయ హింస, అవినీతితో బెంగాల్‌ ఉక్కిరిబిక్కిరవుతోందని అమిత్‌ విమర్శించగా, దేశంలో మతకల్లోలాలు, బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులనుంచి దృష్టి మరలించేందుకు బెంగాల్‌ గురించి మోదీ, షాలు అబద్ధాలు చెబుతున్నారని మమత ప్రతివిమర్శలు చేశారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. మాస్కు మస్ట్‌...ఆలస్యమైన అనుమతించరు

తెలంగాణలోనూ ఇంటర్‌ పరీక్షలు మొదలయ్యాయి. శుక్రవారం నుంచి మొదలైన పరీక్షలకు.. హాజరయ్యే  విద్యార్థులకు మాస్కుధారణ తప్పనిసరి అని ఇంటర్మీడియట్‌ బోర్డు స్పష్టం చేసింది. కొవిడ్‌ నిబంధనలతో.. పరీక్ష కేంద్రాల్లో క్లీన్‌ అండ్‌ గ్రీన్‌తోపాటు శానిటైజేషన్‌ కార్యక్రమాలు పరీక్షలు పూర్తయ్యే వరకు కొనసాగే విధంగా చర్యలు చేపట్టింది. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా సిట్టింగ్‌ ఏర్పాట్లు చేసింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు