టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

6 Jul, 2022 18:09 IST|Sakshi

1. కేంద్ర మంత్రి పదవికి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ రాజీనామా

కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి.. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. రాజ్యసభ ఎంపీగా గురువారం ఆయన పదవీ కాలం ముగుస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఉపరాష్ట్రపతి రేసులో ఆయన నిలబడతారనే ప్రచారం మొదలైంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2. వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు సీఎం జగన్‌

వైఎస్సార్‌ జిల్లాలో ఈనెల 7,8(గురు, శుక్రవారాల్లో) తేదీలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించనున్నారు. ఈ మేరకు అధికార యంత్రాంగం షెడ్యూల్‌ ఖరారు చేసింది. పర్యటనలో భాగంగా.. పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3. నూపుర్‌ శర్మకు స్వల్ప ఊరట
నూపుర్ శర్మను అరెస్టు చేయాలని దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జస్టిస్ ఇందార బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన విశ్రాంత ధర్మాసనం.. ఈ పిటిషన్‌ను మొదట రిజిస్ట్రార్ ముందుకు తీసుకెళ్లాలని సూచించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4. సింగరేణిలో 40వేల కోట్ల అవినీతి.. కేసీఆర్‌, కేటీఆర్‌లపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌
ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్‌.. మంత్రి కేటీఆర్‌లపై సంచలన ఆరోపణలు చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సింగరేణిలో భారీ అవినీతి జరిగిందని, దానిని బయటపెట్టి ప్రజలకు వివరించేందుకు ఎంతదూరమైన వెళ్తానంటూ ప్రకటన చేశాడాయన. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5. విండీస్‌తో సిరీస్‌.. శిఖర్‌ ధావన్‌కు బంపరాఫర్‌
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి జట్టును ప్రకటించింది. ఈ మేరకు విండీస్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడబోయే జట్టు వివరాలు వెల్లడించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6. ఆ కుట్ర వెనుక పెద్దపెద్ద వ్యక్తుల పాత్ర ఉంది: భూమన
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2016–19 మధ్య పెద్ద కుట్ర జరిగిందని శాసససభ  ఉపసంఘం చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. డేటా చోరీ, పెగసస్, ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన శాసనసభ ఉపసంఘం వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సమావేశమైంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7. సల్మాన్‌ ఖాన్‌ లాయర్‌కు బెదిరింపు లేఖ
బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ లాయర్‌ హస్తిమల్‌ సరస్వత్‌కు లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. జోధ్‌పూర్‌ కోర్టులోని తన చాంబర్‌ బయట ఈ లేఖ లభించింది. లేఖలో ‘గాయకుడు మూసేవాలకు పట్టిన గతే నీకూ పడుతుంది. మేము ఎవరినీ వదిలిపెట్టము. మీ కుటుంబ సభ్యులను కూడా విడిచిపెట్టం’ అని రాసి ఉంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. క్వీన్ ఎలిజబెత్ రాయల్‌ డ్యూటీస్‌ కుదింపు.. కారణం అదేనా?
బ్రిటన్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democracy) వచ్చినా.. ఆమె కుటుంబం రాయల్ డ్యూటీస్ అనుభవిస్తోంది. అయితే తాజాగా అనూహ్య పరిణామం ఒకటి చోటు చేసుకుంది. క్వీన్ ఎలిజబెత్ రాయల్ డ్యూటీస్ ను తగ్గించేశారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9. దుమ్ములేపిన పంత్‌.. ఏకంగా! దిగజారిన కోహ్లి ర్యాంకు
ఐసీసీ టెస్టు తాజా ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ అదరగొట్టాడు. ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్‌ టెస్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పంత్‌ అద్భుత ఆటతీరు కనబరిచిన విషయం తెలిసిందే.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10. సెన్సెక్స్‌ జంప్‌, స్పైస్‌జెట్‌కు భారీ షాక్‌

స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. మెటల్‌, ఎనర్జీ రంగాలు తప్ప అన్ని రంగాల షేర్లు లాభ పడ్డాయి. ఆటో, ఫైనాన్స్‌ ఎఫ్‌ఎంసీజీ, ఫెర్టిలైజర్ల షేర్లు బాగా పుంజు కున్నాయి. ఫలితంగా  సెన్సెక్స్‌ 616 పాయింట్లు ఎగిసి  53750 వద్ద, నిఫ్టీ 179 పాయింట్ల లాభంతో 15989 వద్ద ముగిసాయి.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు