Trending News Today: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 ఈవెనింగ్‌ న్యూస్‌

27 May, 2022 17:00 IST|Sakshi

1.. హరియాణా మాజీ ముఖ్యమంత్రికి షాక్‌! నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా


హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతాలకు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం షాకిచ్చింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్షతోపాటు రూ.50 లక్షల జరిమానా కూడా విధిస్తూ శుక్రవారం తీర్పునిచ్చింది.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

2.. మనవరాలిపై లైంగిక ఆరోపణలు.. మన‌స్తాపంతో మాజీ మంత్రి ఆత్మహత్య


కోడలి ఫిర్యాదుతో తీవ్ర మనస్తాపం చెందిన ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ(59) బలవన్మరణానికి పాల్పడ్డారు. బహుగుణ బుధవారం హల్ద్‌వాని ప్రాంతంలోని తన నివాసంలో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

3.. మామను చంపిన ‘బాబు’ ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మామను(నందమూరి తారక రామారావు) చంపి తద్దినం పెట్టిన చంద్రబాబు.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మహానాడు చేస్తున్నాడు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

4..The Greenest Beer: షాకింగ్‌ బీర్‌: వావ్‌ అంటారా? యాక్‌ అంటారా? 


బీర్ అంటే ఇష్టపడని మందుబాబులు ఎవరైనా ఉంటారా?  మార్కెట్లో  విభిన్న ఫ్లేవర్లలో,  రక రకాల బ్రాండ్లలో బీర్లు లభ్యమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త రకమైన బీర్  అందుబాలోకి వచ్చింది. ఈ వెరైటీ బీరుకు లభిస్తున్న ఆదరణ చూస్తే.. మరి వావ్‌.. అనాల్సిందే. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

5.. F3 Telugu Movie Review: ఎఫ్‌3 మూవీ రివ్యూ


సీనియర్‌ హీరో వెంకటేశ్‌, యంగ్‌ హీరో వరుణ్‌ తేజ్‌ మల్టీస్టారర్‌గా అనిల్‌ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌2 చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిందే.ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా మూడు రెట్ల ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తామంటూ  F3ని తీసుకొచ్చాడు అనిల్‌ రావిపూడి. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

6.. IPL 2022 Title Winner Prediction: క్వాలిఫైయర్‌-2లో గెలుపు వారిదే.. టైటిల్‌ కొట్టేదీ వాళ్లే: హర్భజన్‌ సింగ్‌


ఐపీఎల్‌-2022 సీజన్‌ తుది అంకానికి చేరుకుంది. రాజస్తాన్‌ రాయల్స్‌- రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య శుక్రవారం(మే 27) క్వాలిఫైయర్‌-2 జరుగనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ క్యాష్‌ రిచ్‌ లీగ్‌ తాజా ఎడిషన్‌ విజేత ఎవరో అంచనా వేశాడు.
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

7.. ఎస్‌బీఐ ఎకనమిస్టుల అంచనా: మార్చి త్రైమాసికంలో వృద్ధి 2.7 శాతమే!


భారత్‌ ఎకానమీ 2021–22 చివరి త్రైమాసికం (జనవరి–మార్చి)లో కేవలం 2.7 శాతం వృద్ధిని మాత్రమే నమోదుచేస్తుందని బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆర్థిక వేత్తలు అంచనా వేశారు. ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ రేటు 8.5 శాతంగా ఉంటుందని విశ్లేషించారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

8.. అయ్యో బిడ్డా .. శాశ్వతంగా నవ్వు ముఖమే !.. ప్రపంచంలో ఇలాంటి కేసులు 14!


పిల్లలు అన్నాక.. పుట్టిన సమయంలోనైనా ఏడ్వాలి కదా!. కానీ, ఇక్కడో పసికందు నవ్వుతూనే పుట్టింది. ఎందుకో తెలుసా? ఆ బిడ్డ ముఖంలో అలాంటి లోపం ఏర్పడింది. అదీ తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే ఈ స్థితి ఏర్పడింది ఆ పసిపాపకు!. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

9.. Beauty Tips: పసుపు రాసి.. ఇలా చేశారంటే ముఖం నల్లబడుతుంది! జాగ్రత్త


వేసవిలో పసుపుని ముఖానికి గానీ, ఒంటికి గానీ పట్టించాలనుకుంటే నేరుగా కాకుండా పెరుగు, శనగపిండిలలో పసుపు కలిపి పట్టించాలి. ఇలాచేస్తే చర్మానికి చల్లదనం అందుతుంది. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

10.. Honour Killing In Adilabad: ఆదిలాబాద్‌లో మరో పరువు హత్య.. కూతురు ఇష్టంలేని పెళ్లి చేసుకుందని


ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండలం నాగల కొండలో ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురినే తల్లిదండ్రులు హత్య చేశారు. రాజేశ్వరి అనే యువతి వేరే మతానికి చెందిన యువకుడిని ప్రేమించింది. అయితే యువతి తల్లిదండ్రులు పెళ్లి నిరాకరించడంతో.. నెల కిత్రం ఇంట్లో నుంచి పారిపోయి ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకుంది.  కన్న కూతురిని కూడా చూడకుండా శుక్రవారం ఉదయం కత్తితో గొంతుకోసి చంపారు. 
👉 పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు