Trending News: టుడే ట్రెండింగ్‌ & టాప్‌ 10 మార్నింగ్‌ న్యూస్‌

16 Jun, 2022 10:00 IST|Sakshi

1.. HIV-AIDS cure: ఆ ఇంజక్షన్‌తో ఎయిడ్స్‌కు చెక్‌!
వైద్య చరిత్రలో మేలిమలుపు. చికిత్స లేదు నివారణే మార్గమని భావిస్తున్న ఎయిడ్స్‌ వ్యాధిని ఇంజక్షన్‌తో జయించే రోజులు రాబోతున్నాయి. ఇజ్రాయెల్‌కు శాస్త్రవేత్తల బృందం జన్యువుల ఎడిటింగ్‌ విధానాన్ని ఉపయోగించి హెచ్‌ఐవీ–ఎయిడ్స్‌ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్‌ను కనుగొంది. టెల్‌ అవీవ్‌ యూనివర్సిటీకి చెందిన న్యూరో బయోలజీ, బయో కెమిస్ట్రీ, బయో ఫిజిక్స్‌ శాస్త్రవేత్తల బృందం ఎన్నో పరిశోధనలు నిర్వహించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

2.. AP: ఎంపీ రఘురామకృష్ణరాజుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌కు చెల్లించే పన్నులను ఆదాయంగా చూపి ఆర్థిక సంస్థల నుంచి రుణం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఇప్పటికే ఒకసారి తలంటిన హైకోర్టు తాజాగా మరోసారి తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం చేసింది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

3.. రాష్ట్రపతి అభ్యర్థిపై.. మమతా వర్సెస్‌ బీజేపీ!
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ నిరాకరించారు. పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ బుధవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశం ఇందుకు వేదికైంది. కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఎన్సీపీ, డీఎంకే, ఆర్జేడీ, శివసేన, వామపక్షాలతో పాటు 17 విపక్షాలు భేటీలో పాల్గొన్నాయి. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

4.. Visakhapatnam: ఇన్ఫోసిస్‌ @ వైజాగ్‌!
ఐటీ హబ్‌గా విశాఖపట్నం వడివడిగా అడుగులు వేస్తోంది. వైజాగ్‌లో బీచ్‌ ఐటీని ప్రమోట్‌ చేస్తూ దావోస్‌ పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచుకున్న ఆలోచనలకు ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌ ఫిదా అయ్యింది. విశాఖ నుంచి తమ సంస్థ కార్యకలాపాల్ని  ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. దీనివల్ల సుమారు వెయ్యి మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

5.. Basara IIIT: అడిగే హక్కు మాకు లేదా?.. మేము మీ విద్యార్థులం కాదా..?
మేమేమైనా రాజకీయ నాయకులమా? మాకు రాజకీయం చేయా ల్సిన అవసరం ఏముంది..? ఇది మీ యూనివర్సిటీ కాదా! మేం మీ విద్యార్థులం కాదా! సమస్యలను పరిష్కరించాలని అడిగే హక్కు కూడా మాకు లేదా?’ అంటూ బాసర ఆర్జీయూకేటీ (ట్రిపుల్‌ఐటీ) విద్యార్థులు వరుసగా రెండోరోజూ ఆందోళన కొనసాగించారు. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

6.. Tollywood Heroes: కథ, డైలాగులు రాసేస్తున్న హీరోలు.. అట్లుంటది వీళ్లతోని!
కెమెరా ముందు నటులుగా విజృంభిస్తున్నారు...  కెమెరా వెనకాల రచయితలుగా కలం పడుతున్నారు. యువహీరోలు అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ, నవీన్‌ పొలిశెట్టి, కిరణ్‌ అబ్బవరం, విశ్వక్‌ సేన్‌ రచయితలుగా కథలు.. డైలాగులు రాస్తున్నారు.. నాయకులుగా నటిస్తున్నారు. ఈ ‘కథా’నాయకుల కథ తెలుసుకుందాం. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

7.. IND vs SA: దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20.. టీమిండియా యువ పేసర్‌ దూరం..!
దక్షిణాఫ్రికాతో నాలుగో టీ20కు ముందు భారత్‌కు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. జట్టు యువ పేసర్‌ ఆవేష్‌ ఖాన్‌ గాయం కారణంగా రాజ్‌కోట్‌ వేదికగా జరగనున్న నాలుగో టీ20కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌ వేదికగా జరగిన మూడో టీ20లో ఆవేష్‌ ఖాన్‌ కుడి చేతికి గాయమైంది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

8. ఆఫీస్‌లో పనికి ఉద్యోగుల ససేమిరా!
కరోనా మహమ్మా రి తదనంతరం ప్రపంచవ్యాప్తంగా కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఇంటి నుంచి పని విధానానికి కంపెనీలు క్రమంగా స్వస్తి పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏడీపీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక నివేదికను విడుదల చేసింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

9.. హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీ.. టీఆర్‌ఎస్‌ దూకుడు
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నాటికి ఆ పార్టీ నేతలను ఇరుకున పెట్టేలా, ప్రజల్లో నిలదీసేలా ప్రత్యేక కార్యాచరణకు టీఆర్‌ఎస్‌ సిద్ధమైంది. ఏ వేదికనూ, అవకాశాన్నీ వదలకుండా బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని నిర్ణయించింది.
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

10.. చీరకట్టులో స్కేటింగ్.. కేరళ అందాలకు అద్దం పట్టే వీడియో
 మలయాళీ సంప్రదాయ చీరకట్టుతో ఒక మహిళ కేరళ రోడ్లపై స్కేట్‌ బోర్డింగ్‌ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. 
పూర్తి కథనం కోసం క్లిక్‌ చేయండి

మరిన్ని వార్తలు