పాముకు ప్రాణదానం 

15 Nov, 2023 04:39 IST|Sakshi

రాయచూరు రూరల్‌: పాము అంటేనే ప్రాణాలు తీస్తుందని భయపడతాం. కనిపిస్తే పరుగులు తీస్తాం... కానీ అస్వస్థతకు గురైన ఓ పామును వైద్యులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి వైద్యం చేసి ఊపిరిపోశారు. ఈ సంఘటన మంగళవారం కర్ణాటకలోని రాయచూరు జిల్లా లింగసూగూరులో చోటుచేసుకుంది. లింగసూగూరు తాలూకా హట్టి సమీపంలోని పామనకల్లూరు క్రాస్‌ వద్ద ఓ జెర్రిపోతు పాము కారులోకి దూరింది.

హట్టి ఆస్పత్రి వైద్యుడు రవీంద్రనాథ్‌ ఆ పామును పట్టుకోవడానికి ప్రయత్నించగా దొరకలేదు. అది కారు నుంచి బయటకు రావాలని ఫినాయిల్‌ చల్లడంతో వాసన తట్టుకోలేక బయటకొచ్చింది. కానీ స్పృహ తప్పి అచేతనంగా పడిపోయింది. ఈ విషయం తెలుసుకున్న లింగసూగూరుకు చెందిన పాముల వైద్యుడు ఖాలిద్‌ చావుస్‌ వచ్చి ఆ పామును గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లి చికిత్స అందించారు. పాము నోట్లో ఆక్సిజన్‌ పైపు పెట్టి చికిత్స చేయడంతో కోలుకుంది. తర్వాత ఆ పామును ఊరికి దూరంగా వదిలిపెట్టారు. 

మరిన్ని వార్తలు