వైరల్‌ వీడియో: భయమే లేని శునకం! సింహాన్ని ఎలా తరిమిందో చూడండి

11 May, 2022 17:40 IST|Sakshi

సింహం అడవికి రాజు. దాన్ని చూస్తే ఏ జంతువైనా భయంతో వణికిపోతుంది. సింహాలు చాలా ప్రమాదకరమైనవి, శక్తివంతమైనవి. ఇక శత్రువును వెంటాడి ఆహారం చేసుకోవడంలో దిట్ట. అడవిలోనూ జంతువులను సింహాం గజగజ వణికిస్తే.. తాజాగా ఓ శునకం సింహాన్ని వెంటాడి ఏకంగా తరిమికొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని లోధికా తాలూకాలోని మాగాణి గ్రామంలో సింహం తిరుగుతున్నట్లు గ్రామస్తులు గుర్తించారు. రైతుల పంట పొలాల వద్ద ఉండగా సింహాం కనిపించింది.

కాగా అటవీ జంతువుల నుంచి పంటలను కాపాడేందుకు రైతులు పొలాల వద్ద ఓ కుక్కను కాపలాగా ఉంచారు. అయితే అటుగా వచ్చిన సింహాన్ని చూసి శునకం ఏమాత్రం భయపడలేదు. పంట పొలాల నుంచి గ్రామం వైపు వస్తున్న సింహాన్ని ఆ శనకం వెంటాడి గ్రామ సరిహద్దుల వరకు తరిమికొట్టింది. శనకం సింహాన్ని తరిమికొట్టడంతో గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. దీనిని చూసేందుకు జ‌నాలు భారీగా త‌ర‌లివ‌చ్చారు. అనంతరం సింహం గురించి గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే సింహాన్ని తిరిగి గిర్‌ అభయారణ్యంలోకి పంపినట్లు అధికారుల తెలిపారు. 
చదవండి: క్రేజీ లవ్‌: గర్ల్‌ ఫ్రెండ్‌ కోసం మొత్తం గ్రామానికే కరెంట్‌ లేకుండా చేశాడు

మరిన్ని వార్తలు