మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ల్లో నేడే పోలింగ్‌

17 Nov, 2023 05:42 IST|Sakshi
ఇండోర్‌లో ఎన్నికల సామగ్రితో వెళుతున్న సిబ్బంది

ఎంపీలో మొత్తం 230 సీట్లు

ఛత్తీస్‌లో 70 అసెంబ్లీ స్థానాలు

బీజేపీ, కాంగ్రెస్‌ హోరాహోరీ

భోపాల్‌/రాయ్‌పూర్‌: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. కీలకమైన మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం ఒకే దశలో పోలింగ్‌ జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 సీట్లకు గాను రెండో, తుది దశలో భాగంగా 70 అసెంబ్లీ సీట్లకు కూడా పోలింగ్‌ జరుగుతుంది. ఆ రాష్ట్రంలో నవంబర్‌ 7న తొలి దశలో 20 నక్సల్స్‌ ప్రాబల్య స్థానాల్లో పోలింగ్‌ ముగియడం తెలిసిందే. అదే తేదీన ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మొత్తం 40 స్థానాకలు ఒకే దశలో పోలింగ్‌ జరిగింది. మరో కీలక రాష్ట్రమైన రాజస్థాన్‌లో నవంబర్‌ 25న, చివరగా తెలంగాణలో నవంబర్‌ 30న పోలింగ్‌ జరగనుంది. మొత్తం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలూ డిసెంబర్‌ 3న వెల్లడవుతాయి.

మధ్యప్రదేశ్‌లో..
మధ్యప్రదేశ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 114 స్థానాలతో అతి పెద్ద పారీ్టగా అవతరించింది. బీఎస్పీ, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 15 నెలలకే జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో 22 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో కుప్పకూలింది. శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ సారథ్యంలో బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈసారి ఆ రెండింటితో పాటు సమాజ్‌వాదీ పార్టీ కూడా మరోసారి గట్టిగా ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తోంది...

ఛత్తీస్‌గఢ్‌ రెండో దశలో...
రాష్ట్రంలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 68 సీట్లతో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించింది. ఈ ఐదేళ్లలో సీఎం భూపేశ్‌ బఘెల్‌ పలు ప్రజాకర్షక పథకాలతో రైతులతో పాటు అన్ని వర్గాలనూ ఆకట్టుకుంటూ వచ్చారు. అనంరం ఉప ఎన్నికల విజయాలతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ బలం 71కి పెరిగింది. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లతో పాటు బీఎస్పీ, ఆమ్‌ ఆద్మీ పార్టీ కూడా పోటీలో ఉన్నాయి...

మరిన్ని వార్తలు