ఆటా మహాసభలు: ఏపీ పెవిలియన్‌ ప్రారంభం

3 Jul, 2022 10:44 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా తెలుగు అసోసియేషన్ (ఆటా)17వ మహాసభలు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి. మూడురోజుల పాటు  వాష్టింగ్టన్‌ డీసీలో జరుగు తున్న ఈ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రతినిధులు రత్నాకర్ పండుగాయల, హరి ప్రసాద్ లింగాల, మేడపాటి వెంకట్ ఏపీ పెవిలియన్ ను  ప్రారంభించారు.

17వ ఆటా కన్వెన్షన్ అండ్‌ యూత్ కాన్ఫరెన్స్‌లో డా.వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో  పెద్దసంఖ్యలో వైఎస్సార్ అభిమానులు, నేతలు హాజరైన ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.ఆ మహానేత సేవలను, స్ఫూర్తిని ఏపీ ఆధికారిక భాషా సంఘం అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్మి ప్రసాద్ రావు గుర్తు చేశారు.  పలువురు రాజకీయ నాయకులు, కళాకారులు ఆటా  వేడుకల్లో సందడి చేస్తున్నారు.

- వాష్టింగ్టన్‌ డీసీ నుంచి సాక్షి  ప్రత్యేక ప్రతినిధి

మరిన్ని వార్తలు