చికాగోలో సీయోను తెలుగు చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

27 Dec, 2022 21:01 IST|Sakshi

చికాగోలోని ప్రవాస తెలుగువారు క్రిస్మస్ వేడుకలను సీయోను తెలుగు చర్చిలో అత్యంత వైభవంగా సీనియర్ పాస్టర్ ఇంటర్నేషనల్ స్పీకర్ మాథ్యూస్ వట్టిప్రోలు ఆధ్వర్యంలో జరుపుకున్నారు.


యేసు ప్రభు పుట్టుకను జ్ఞాపకం చేస్తూ చేసిన చిన్నపిల్లల డాన్స్, యూత్ డాన్స్‌లు, కారల్ సాంగ్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. శాంతాక్లాస్ చిన్న పిల్లలకు బహుమతులు అందచేశాడు. యేసు ప్రభు రెండువేల సంవత్సరాల క్రితం బెత్లహేంలో జన్మించినది స్కిట్‌గా ఆవిష్కరించిన రీతి ఈ వేడుకలకు హైలైట్‌గా నిలిచింది.

ఈ సందర్భంగా పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు మాట్లాడుతూ సీయోను తెలుగు చర్చి రెండు కుటుంబాలతో ప్రారంభమై ఇప్పుడు అరవై ఐదు కుటుంబాలతో అమెరికాలోనే అత్యంత వేగంగా పెరుగుతున్న తెలుగు చర్చిగా క్రిస్మస్ వేడుకలు జరుపుకోవటం ఎంతో ఆనందాన్ని కలుగచేస్తోందన్నారు. క్రిస్మస్ సందేశాన్ని అందచేస్తూ యేసు ప్రభు జననం ఎందుకు అవసరమో, మానవాళికి అది ఎంత అధ్బుతమనేది వివరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ జరుపుకుంటున్న వారందరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు